మీ పిల్లలకి జలుబుగా ఉందా..? అయితే ఆ ఆహారపదార్దాలు పెట్టకండి..!

-

శీతాకాలంలో చాలా సాధారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి వాతావరణం మారడం సహజమే. అప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే పిల్లలు లో జలుబు, ఫ్లూ వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అయితే అటువంటి సమయంలో ఈ ఆహార పదార్థాలని పిల్లలకి పెట్టడం మంచిది కాదు. దీని వలన ఆరోగ్య పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. మరి ఎటువంటి ఆహార పదార్థాలని పిల్లలకి ఈ సమయంలో పెట్టకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.

స్ట్రాబెరీ:

జలుబు దగ్గు వంటి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు పిల్లలకి స్ట్రాబెర్రీ ఇవ్వకండి.

చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు:

మామూలు టైం లోనే చాక్లెట్లు ఐస్క్రీమ్స్ పిల్లలకి పడవు అలాంటిది ఆరోగ్యం బాగో లేనప్పుడు క్లైమేట్ బాగోలేనప్పుడు ఇలాంటివి పెడితే వాళ్లకి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక పెట్టద్దు.

ద్రాక్ష పండ్లు:

పిల్లలకి శీతాకాలంలో ద్రాక్ష పండ్లను ఇవ్వకండి. పిల్లలు ఆరోగ్య బాగుండాలన్నా రోగ నిరోధక శక్తిని పెంచాలన్నా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను ఇవ్వండి. విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉండే వాటిని ఎంపిక చేయండి ఆకు పచ్చని కూరగాయలు డ్రై ఫ్రూట్స్ వంటివి ఇవ్వచ్చు. కూరగాయలు వంటి వాటిని ఎక్కువగా పెడుతూ ఉండండి బయట ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉంచండి. ఇలా ఈ విధంగా శ్రద్ధ తీసుకుంటే పిల్లల్లో సమస్యలు తగ్గుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news