ఈ ఆకు తింటే..రక్తహీనత సమస్యకు శాశ్వత పరిష్కారం..ఎంత రక్తం కావాలంటే అంత బ్లడ్ వచ్చినట్లే..!

-

పూర్వం రోజుల్లో ఆహారం లేక..కొన్ని తినక పోషకాలు లోపించడం జరిగింది. అన్నీ పోషకాలు అందేవి కావు..డబ్బుల్లులేక, ఆహారం లేక..ఇన్ఫెక్షన్స్ వచ్చేవి. ఇప్పుడు డబ్బులెక్కువైనాయి..ఆహారం ఎక్కువైంది..పాలిష్ చేసినవి, ఉడికించవాటిని పదేపదే ఫ్రిడ్జ్ లో పెట్టేసి తినటం, వేపటం, నూనెలో దేవటం, ఒవెన్ లో పెట్టే ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. దీనివల్ల మనం తినే ఆహారంలో ఉండే పోషకాలు మనదాక చేరటం లేదు. కొన్నిసార్లు..డాక్టర్లు మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇస్తారు. అంటే..మన శరీరంలో లోపంచిన విటిమిన్స్ కి టాబ్లెట్ ద్వారా భర్తీ చేయటం.

అలా అని మనకు మనమే తెచ్చుకుని మింగేయకూడదు. కొందరు ఇలానే చేస్తుంటారు. డాక్టర్లు మన శరీరం, వయస్సు దృష్టిలో పెట్టుకుని..టాబ్లెట్స్ ఇస్తారు. అన్నీ టాబ్లెట్స్ లో కొన్ని విటమిన్స్ ఉంటాయి, కొన్ని ఉండవు. మన శరీరానికి ఏది అవసరమో అది డాక్టర్లు పరీక్షించి ఇస్తారు. అందరూ వేసుకుంటున్నారుకదా.. మనం వేసుకోవాలి, ఏదో నష్టం జరిగిపోతుందని వేసుకోకూడదు. మనం ఆహారం ద్వారా విటమిన్స్ తీసుకున్నప్పుడు అసలు ఈ టాబ్లెట్స్ వేయాల్సిన అవసరం లేదు. ప్రకృతి మనకు అన్నీ ఇచ్చింది.

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఆకుకూరలు. అందరికి తెలుసు..ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని కానీ.., అవి అంత రుచిగా ఉండవని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఖర్చు తక్కువలో మనకు చాలా ఎక్కువ పోషకాలను ఆకు కూరలు ఇస్తాయి. రక్తహీనత రాకుండా రక్షించడానికి, ఎముకలు గుల్లబారకుండా కాపాడటానికి అద్భుతంగా ఆకుకూరలు పనికొస్తాయి. ఆకు కూరల్లో కూడా అనేక రకాల ఆకు కూరలు ఉంటాయి. మనకు మాత్రం ఆకు కూరలు అనగానే..పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, కొత్తిమీరే గుర్తుకువస్తాయి. కానీ ఇంకా చాలా ఉంటాయి. అందులో ఒకటి పార్స్లీ..చూసేందుకు కొత్తిమీరలాగా ఉంటుంది. ఇది బాగా వాడుకోవడం వల్ల చాలా పోషకాలు ఉంటాయి. దీన్ని సలాడ్స్ లో, సూప్స్ లో, పుల్కాల్లో వాడుకోవచ్చు. ఇతర దేశాల్లో దీన్ని ఎక్కువగా వాడుతారు.

100 గ్రాముల పార్స్లీ ఆకుకూరలో ఉండే పోషకాలు ఏంటంటే..

పిండిపదార్ధాలు 6 గ్రాములు
మాంసకృతులు3 గ్రాములు..సాధారణంగా మిగతా ఆకుకూరల్లో మాంసకృతులు చాలా తక్కువగా ఉంటాయి. కానీ పార్స్లీలో ఉంటాయి. తేలిగ్గా డైజెషన్ అయి రక్తంలోకి వెళ్తాయి.
కొవ్వు 1.2గ్రాములు
పీచులు 4 గ్రాములు
శక్తి 36 కాలరీలు
బీటాకిరోటిన్ అంటే కంటి చూపును మెరుగుచేయడానికి, యాంటిఆక్సిడెంట్స్ లా పనిచేసి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. ఇది ఈ పార్స్లీ ఆకులో 5054 మైక్రోగ్రామ్స్ ఉంది. మన శరీరానికి ఒకరోజుకు 2400 మైక్రో గ్రామ్స్ సరిపోతుంది.
విటమిన్ సీ 133 మిల్లీ గ్రాములు ఉంది. కమలాల్లో బత్తాయిల్లో ఉండేదానికంటే ఎక్కువ ఉంది.
విటమిన్ k 1640 మైక్రో గ్రామ్స్ ఇందులో ఉంది.

ఈ ఆకు రక్షణవ్యవస్థకు, బాడీరిపేర్ క్లీనింగ్ కి యాంటి ఆక్సిడెంట్ లా బాగా పనిచేస్తుంది. శరీరం జబ్బులకు గురికాకుండా ఇది బాగా రక్షిస్తుంది. ఫారనర్స్ ఎక్కువగా ఈ ఆకును సలాడ్స్ లో ఉపయోగిస్తారు.

ఈ ఆకును వాడటం వల్ల మనకు ఏం ప్రయోజనం ఉంటుందంటే..

2016వ సంవత్సరంలో బినీ సుయఫ్ యూనివర్శిటీ ఈజిప్టువారు పార్స్లీమీద పరిశోధన చేశారు. ముఖ్యంగా ఇది బ్లడ్ యసిడ్ అయిందాన్ని ఆల్కలిన్ గా మార్చడానికి అద్భుతంగా మార్చడానికి పనికొస్తుందని పరిశోధనలో చెప్పారు. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పంచదార పదార్థాలు ఇవన్నీ యసిడిక్ ఫుడ్స్..రక్తాన్ని ఆమ్లంగా మార్చేస్తాయి. ఈ యసిడిక్ నేచర్ మన బ్లడ్ ఎంత ఎక్కువగా ఉంటుందో..ఈ ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. బ్లడ్ ఎప్పుడు క్షారత్వంగా ఉండాలి. వీటివల్ల బ్లడ్ ఆమ్లత్వం పెరుగుతుంది. అప్పుడు బాడీ నూటర్లైజ్ చేయడానికి ఎముకల్లో ఉండే కాల్షియాన్ని లాక్కొచ్చి..ఈ యాసిడ్ లెవల్ ను తగ్గించి క్షారత్వం పెంచడానికి ట్రై చేస్తుంది. ఈ ప్రాసెస్ లో ఎముకల్లో ఉండే కాల్షియం తగ్గి..ఎముకలు గుల్లబారిపోతాయి. ఈ పార్స్లీ బాగా తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే యాసిడ్ లెవల్ ను తగ్గించి, ఆల్కలిన్ ను పెంచుతుంది. బ్లడ్ ఆల్కలిన్ గా ఉన్నప్పుడు కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.

బ్లడ్ ఎప్పుడు ఆల్కలిన్ గా ఉంటే..ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇది బాగుంటే..ఎంత మంచిదో మనందరికి తెలిసిందే.

ఎముకలు గుల్లబారకుండా ఈ ఆకుబాగా పనికొస్తుంది.

విటమిన్ సీ, విటమిన్ కే ఉండటం వల్ల పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ లా పనికొస్తుంది.

ఇన్సులిన్ రిసిస్టెన్స్ కు కూడా తగ్గిస్తుంది..ఈరోజుల్లో ఊబకాయం ఉన్నవారికి ఎక్కువగా ఉంటుందగి. ఘగర్ రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఒక కారణం. ఈ ఆకులో ఉండే బీటా కెరోటిన్ ఇన్సులిన్ రెసిస్టెన్ ను తగ్గిస్తుంది. తద్వారా ఘగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ఎలుకల మీద పరిశోధన చేసి వీళ్లు నిరూపించారు.

ఈ పార్స్లీ ఎపియో, మైరిస్టిసిన్ అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి యాంటీబాక్టిరియాలుగా పనిచేస్తాయి. ఇవి బాగా ఉండటం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ , బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా తగ్గించడానికి ఈ కాంపౌండ్స్ ఉపయోగపడుతున్నాయని పరిశోధనలో తేలింది.

ఏ ఆకుకూరైనా రక్తహీనత రాకుండా రక్షిస్తుంది. కాల్షియం మంచిగా ఉంటుంది. తద్వారా ఎముకల నుంచి కాల్షియం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆకుకూరలను వారానికి ఆరు రోజులు తినాలని నియమం పెట్టుకుంటే..ఆరోగ్యానికి చాలా మంచిది.

ఈ పార్స్లీ ఆకును పుల్కా పిండిలో కలిపి వేసుకోవచ్చు. సలాడ్స్ వేసుకోవచ్చు, సూప్స్ లో లాస్ట్ లో దింపేసేటప్పుడు వేస్తే..వాల్యూస్ పోకుండా ఉంటాయి. స్ప్రౌట్స్ లో వేసుకోవచ్చు. దీన్ని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు.

రక్తహీనత ఉన్నవారికి త్వరగా బ్లడ్ రావాలంటే..

కొంతమందికి బ్లడ్ తగ్గిపోయి..ఒకస్థాయికి రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనకు రక్తకణాలు ఒకసారి పుడితే వాటి ఆయుర్ధాయం 120రోజులు. మనం సరిగా ఆహార నియమాలు పాటించకపోతే.బలహీనంగా పుడతాయి..మళ్లీ కొత్తకణాలు ఉత్పత్తి అవ్వాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉండే..చాలా సమస్యలు వస్తాయి. శరీరానికి రక్తం అనేది వాహనం లాంటిది. ఇది హిమోగ్గోబిన్ ను మోసుకెళ్తుంది. ప్రాణవాయివును మోసుకెళ్లే ఈ రక్తం తక్కువగా ఉన్నవారికి..ఎక్కువగా ఆయాసం వస్తుంది.

ఏ రకమైన రక్తహీన ఉన్నప్పటి శాశ్వత పరిష్కారం ఒకటి ఉంది. గోధమ గడ్డి శరీరానికి రక్తాన్ని పుష్కలంగా అందిస్తుంది. వీట్ గ్రాస్ కి రక్తం డైరెక్టుగా పట్టేస్తుంది. ఒక నెలరోజులు రోజుకు ఒకటి రెండు కప్పులు తాగారంటే..రక్తహీనత సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. హిమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో..వీట్ గ్రాస్ స్ట్రక్చర్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి డైరెక్టుగా రక్తం తీసుకున్నట్లే. మార్కెట్లో దొరికితే కొనుక్కోవచ్చు లేదా ఇంట్లో పండిచ్చుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి.. 150ML తీసుకుంటే సరి. మార్నింగ్ టైం తాగితే చాలు. సమస్య తీవ్రంగా ఉండే గంట గ్యాప్ ఇచ్చి రెండు గ్లాసులు తాగితే చాలు సమస్య పరిష్కారం అవుతుందని ప్రముఖ ప్రకృతివైద్య నిపుణులు చెబుతున్నారు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news