మగవారి లైంగిక సామర్థ్యాన్ని పెంచే అత్తిపత్తి పౌడర్.. సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన వాస్తవం..!

-

ఊబకాయం పెరగడం వల్ల, చిన్నవయసులో షుగర్ రావడం, బాగా జంక్ ఫుడ్స్ తినటం వల్ల మగవారిలో మేల్ హార్మోన్( Testosterone) తగ్గిపోతుంది. లైంగిక్ సామార్థ్యం కూడా చాలా మంది పురుషుల్లో తగ్గి మందులు ఉపయోగిస్తున్నారు. ఈ మందులు కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ రావడం, కుటుంబాలలో మానసిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం ఈరోజుల్లో చాలామంది పురుషులకు ఉంది. ఈ సమస్య ఉన్నవారు బయటకు చెప్పరు. వైద్యులను సంప్రదించడానికే చాలా ఆలోచిస్తారు. నలుగురితో చెప్పుకునే సమస్యకాదు కదా. చెప్పడానికి నామూషి. ఈ క్రమంలో ఇంగ్లీష్ మందులు వాడటం ప్రారంభిస్తారు. కానీ వీటివాడకం లాంగ్ రన్లో మంచిది కాదు..అనుభవం మీదే తెలుస్తుంది. మరి ఇలాంటి సమస్య ఉన్నవారు లైంగిక సామార్థ్యాన్ని పెంచుకోవడానికి, మేల్ హార్మోన్ ను నాచురల్ గా ఉత్పత్తి అయ్యేలా చేసుకునే మార్గాలు కూడా ఉన్నాయిగా.

2009వ సంవత్సరంలో బరకతుల్లా యూనివర్శిటీ వారు ( Barkatullah University Nri Institute Of Pharmaceutical Sciences- Bhopal) పరిశోధన చేసి నాచురల్గా లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి అత్తిపత్తి పౌడర్ అద్భుతంగా పనికొస్తుందని నిరూపించారు. అత్తిపత్తి అంటే మీకు గుర్తుకువచ్చి ఉండదమే కానీ టచ్ మీ నాట్ చెట్టేనండి ( Touch Me not) . మనం చిన్నప్పుడు దీంతో ఆడుకునేవాళ్లం. భలే ముట్టుకోగానే ఆకులు ముడుచుకుపోతాయి. అదే.. అత్తిపత్తి వేళ్లను( roots) తీసుకుని దాన్ని పౌడర్ చేసి ఎలుకల మీద పరిశోధన చేశారట.

పరిశోధన ఎలా జరిగింది..

రెండు గ్రూపులుగా ఎలుకలను విడగొడతారు. ఒక గ్రూప్ ఎలుకలగు అత్తిపత్తి పౌడర్ ను ఉదయం సాయంకాలం కలిపి 18 గ్రాములు ఇచ్చారట. మరొక గ్రూప్ ఎలుకలకు వయాగ్రా ఇచ్చారట. అత్తిపత్తి పౌడర్ తిన్న ఎలుకలకు 12రోజులనే.. వయాగ్రాకు లైంగిక సామార్థ్యం ఎలా పెరుగుతుందో..దానికి సమానంగా పెరుగడంతో పాటు.. టెస్టోస్టిరోన్(Testosterone)హార్మోన్స్ కూడా పెరిగాయిని వీళ్లు గుర్తించారు. ఎంత శాతం అంటే..37% లైంగిక సామార్థ్యం, మేల్ హోర్మోన్ 25% పెరిగిందట.

అత్తిపత్తి వేళ్లల్లో ఉన్న ఔషదగుణాల్లో క్వినిన్స్( Quinine), ఫ్లేవనాయిడ్స్ (Flavonoid), కౌమారిన్స్ (Coumarin) కారణంగానే లైంగిక సామర్థ్యం పెరుగుతుందట. వృషణాల్లో సైజ్, సంఖ్య పెరగడం కూడా జరుగుతుందట. వీర్యకణాల ఉత్పత్తి కూడా పెరుగడంతోపాటు.. స్పీడ్ గా కూడా పెరుగుతుందంట.

ఆన్ లైన్ లో కూడా అత్తిపత్తి పౌడర్ అందుబాటులో ఉంది. కేజీ 400-600వరకూ ఉంది. అయితే మార్కెట్లో చెట్టు, ఆకులు, వేళ్లు అన్ని కలిపి పౌడర్ చేసి అమ్ముతారట. కానీ మనకు కావాల్సిందే వేళ్లపొడి మాత్రమే. కానీ మార్కెట్ లో ప్యూర్ గా వేళ్లపొడి అందుబాటులో లేదు. పల్లెటూర్లలలో ఉండే వారికి అత్తిపత్తి చెట్లు విరివిగా ఉంటాయి. చెట్లు పీకేసి.. వేళ్ల ఎండపెట్టి పౌడర్ గా చేసుకుని వాడుకోవచ్చు. మార్కెట్ లో దొరికేది అయితే.. ఎక్కువ మోతాదులో వాడాల్సి ఉంటుంది. కేవలం రూట్స్ తో చేసిన పౌడర్ అయితే 18 గ్రాములు రోజుకు సరిపోతుంది.

ఎలా వాడుకోవచ్చు..?

పొడికి తేనె కలుపుకుని తినేయటం ఒక పద్దతి. 200ML వాటర్లో ఒక టేబుల్ స్పూన్ అత్తిపత్తి పౌడర్ వేసి 100 ML వచ్చే వరకూ మరిగించండి. డైరెక్టుగా వేళ్లను వాడటానికే ప్రయత్నించండి అంటున్నారు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు. సమస్య ఉన్నవారు సైంటిఫిక్ గా పనికొస్తుందని ప్రూవ్ అయింది కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news