పీచుపదర్థాలు కలిగి ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంటారు. అది అందరికీ తెలిసిందే. కానీ ఆ పీచే పదార్థం ఉండే ఆహారం ఏది అంటే ఆలోచించి నిదానంగా చెప్పినా బీరకాయ్ అని అంటారు. ఇది ఎంత వరకు సమంజసం. అసలు శరీరంలోకి బీరకాయ్ వెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలియకుండానే తినాలంటే కాస్త అభ్యంతకర విషయమే. ఎదైనా తినే ముందు దాని విలువ ప్రాముఖ్యత తెలిస్తే ఆ విషయమే వేరు. మరి పీచు పదార్థం కలిగున్న బీరకాయలో మనకు తెలియని విషయాలు తెలుసుకుందాం.
– బీరకాయలో విటమిన్ సి, ఐరన్ రిబోప్లేవిన్, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవనాలుంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ మంచి ఆహారం.
– సెల్యులోజ్, నీటిశాతం ఎక్కువ కాబట్టి మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధపడేవారికి బీరకాయ తినడం చక్కటి పరిష్కారం.
– రక్తంలోనూ మూత్రంలోనూ చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకుంటే మంచిది.
– బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.
– బీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలు, యాక్నే సమస్యలు తొలిగిపోతాయి. దేహం నుంచి ఆల్కహాల్ కారక వ్యర్థాలను తొలిగించి కాలేయం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
– కామెర్ల వ్యాధి సహజంగా తగ్గాలంటే రోజూ ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే చాలు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
– బీరకాయ రక్తశుద్ధికీ కాలేయం ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది.
– ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది. మందుబాబుల ఆహారంలో బీరకాయ చేర్చితే వారి కాలేయానికి ఎలాంటి ఢోకా ఉండదు. కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుందనీ తేలింది.
– అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. బీరకాయలోని విటమిన్ ఎ కంటి కండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
– ఇందులోని విటమిన్ బి6 అనీమియాను నివారించగలదని కూడా ఆరోగ్య నిపుణులు అంటున్నారు.