ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని మనందరికి తెలుసు. తెలిసి కూడా తాగటం మాత్రం ఎవరూ ఆపరు. మొదట్లో మెల్లిమెల్లిగా స్టాట్ అవుతుంది. ఆ తర్వాత బానిసల్ని చేస్తుంది. చాలా మంది సిగిరెట్ తాగటానికి ముఖ్య కారణం..ఒకటి స్టైల్ కోసం స్టాట్ చేస్తారు, ఇంకోటి టెన్షన్, తలనొప్పి, ప్రజర్ ఈ పరిస్థితుల్లో దోస్తుగాళ్లు ఏదో మాటవరసకు దమ్ముకొడితే పోతదిరా అంటారు..అంతే ఇక తాగటం స్టాట్ చేస్తేస్తాం. ఆ తర్వాత ప్రతిసారి నాలుగ లాగుతూ ఉంటుంది. ఒకటి రెండు అవుతుంది. రెండు నాలుగు అవుతుంది. కొన్నాళ్లకు ప్యాకెట్ అయిపోతుంది.
మీరు స్మోకింగ్ మానేయాలనుకుంటే.. ప్రతిరోజూ పచ్చి లేదా ఉడకబెట్టిన ఉసిరికాయను తినాలి. స్మోకింగ్ వల్ల శరీరంలో పేరుకుపోయిన కలుషితాలు లేదా టాక్సిన్స్ త్వరగా తొలగిపోతాయట. దీంతో స్మోకింగ్‌పై ఆసక్తి క్రమంగా తగ్గుతుంది. కానీ, వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల 7 రోజుల్లో స్మోకింగ్ చేయాలనే కోరిక తగ్గుపోతుంది.
పొగ తాగాలని అనిపించినప్పుడు పుదీనా ఆకులను నమిలి తినాలి. దీంతో నికోటిన్‌పై ఆసక్తి చాలా వరకు తగ్గుతుంది.
త్రిఫల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. స్మోకింగ్ పై కూడా చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపున త్రిఫలాన్ని నానబెట్టిన నీటిని తాగాలి. స్మోకింగ్ చేయాలనే కోరిక తగ్గుతుంది.
వీటిల్లో మీకు సులుభంగా అనిపించింది ఏదో ఒకటి క్రమం తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి..ఒకే రోజుల్లో కాకపోవచ్చు..కానీ ఒక రోజు మాత్రం కచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు.