మీ వయస్సుకి తగ్గ బరువు ఉన్నారా..? ఏ వయస్సు వారు ఎంత బరువు ఉండాలంటే..?

-

ఎంత బరువు ఉండాలి..? నేను ఎక్కువ బరువు ఉన్నానా తక్కువ బరువు ఉన్నానా అని చాలా మంది పదే పదే బరువు గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేదంటే ఒక్కసారి లావుగా కనపడనా లేదంటే ఒళ్ళు చేసారని ఎవరైనా చెప్పినా బాబోయ్ అధిక బరువు ఉన్నానేమో.. తగ్గిపోవాలి ఏమో అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే ఏ వయసు వాళ్ళు ఎంత బరువు ఉండాలి..? ఎంత ఎత్తుకు ఎంత బరువు ఉండాలి అనేది ఎలా తెలుస్తుంది..? వాటి గురించి ఇప్పుడు చూద్దాం. బీఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. మీ బరువు మీ ఎత్తుకు సరిపోయిందో లేదో ఇది చెప్తుంది.

బీఎంఐ సరిగ్గా లేకపోతే షుగర్, పక్షవాతం మొదలు బీపీ ఇలా అనేక సమస్యలు వస్తాయి. అయితే ఏ వయసు వాళ్ళు ఎంత బరువు ఉండాలి మీ ఎత్తుకి ఎంత బరువు ఉండాలి అనే వాటి గురించి ఇప్పుడు చూద్దాం. 19-29 సంవత్సరాల వయస్సు పురుషులు 83.4, స్త్రీ అయితే 73.4 బరువు ఉండాలి. 30-39 సంవత్సరాల పురుషులు 90.3 కిలోలు, స్త్రీ 76.7 కిలోలు ఉండాలి. 40-49 సంవత్సరాలు పురుషులైతే 90.9 కిలోలు, స్త్రీ 76.2 ఉండాలి. 50-60 సంవత్సరాలు పురుషుడు 91.3, స్త్రీ 77.0 కిలోల వరకు ఉండాలి.

4 అడుగుల 10 అంగుళాలు వారు 41 నుండి 52 కిలోలు, 5 అడుగులు వాళ్ళు 44 నుండి 55.7 కిలోలు, 5 అడుగుల 2 అంగుళాలు ఉన్నట్టయితే 49 నుండి 63, 5 అడుగుల 4 అంగుళాలుకైతే 49 నుండి 63 కిలోలు, 5 అడుగుల 6 అంగుళాలు వారు 53 నుండి 67 కిలోలు, 5 అడుగుల 8 అంగుళాలు ఉన్నట్టయితే 56 నుండి 71 కిలోలు, 5 అడుగుల 10 అంగుళాలు ఉంటే 59 నుండి 75 కిలోలు ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version