ఈ రెండు రొట్టెలు రోజుకు రెండు తింటే.. నెలకు ఈజీగా 5 కిలోల బరువు తగ్గొచ్చు..!

బరువు తగ్గాలనుకునే వారు.. ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. తిండి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే.. బరువు తగ్గడం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు చెప్పుకోబోయే రొట్టెలు రోజూ తింటే చాలు.. చాలామంది చపాతీలు తింటే బరువు తగ్గొచ్చు అనుకుంటారు.. గోధుమపిండిలో గ్లూటెన్ అధికం. రోజూ గ్లూటెన్ తినడం వల్ల బరువు తగ్గడం అటుంచితే ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొందరికి గ్లూటెన్ అలెర్జీ కూడా ఉంటుంది. బరువు తగ్గేందుకు గోధుమపిండి కన్నా మరో రెండు రకాల పిండితో చేసే రోటీలు సహకరిస్తాయి. ఈ పిండిలలో గ్లూటెన్ ఉండదు పైగా అధికంగా ఫైబర్, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి మీకు బరువును తగ్గించడంలో సహకరిస్తాయి. రాగి, జొన్న పిండితో బరువు ఈజీగా తగ్గొచ్చు.

గోధుమ చపాతీలు ఎందుకు వద్దు?

గోధుమ పిండి అందరి శరీరాలకి పడాలని లేదు. ఇవి తిన్న కొందరిలో అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. దద్దుర్లు వంటి చర్మ సమస్యలు వస్తాయి. గోధుమలలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. రోజూ చపాతీలు తినడం వల్ల పిత్తాశయంలో, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు మెల్లగా పెరిగేందుకు కూడా ఇది కారణం అవుతుంది. ఇది ముఖ్యమైన ఖనిజాల శోషణను నిరోధిస్తుంది.

రాగి, జొన్న పిండి వల్ల ఏంటి లాభం…

రాగి పిండి, జొన్న పిండితో చేసిన రోటీలు తినడం వల్ల బరువు తగ్గడమే కాదు, ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ రెండింటిలో ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.. ఆకలిని తగ్గించేటప్పుడు జీవక్రియ రేటును పెంచుతాయి. అందువల్ల ఈ రెండు రోటీలు తినడం వల్ల త్వరగా, ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఒక్క జొన్న రోటీలో 12 గ్రాముల ఫైబర్, 22 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అదనంగా పోషకాలు కూడా అందుతాయి. అలాగే రాగి రొట్టెలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ చాలా సమృద్ధిగా ఉంటుంది. 100 గ్రాముల రాగిపిండిలో 13 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది. వీటిలో ఏదో ఒక రొట్టెను డైలీ తింటంటే..హెల్తీగా బరువు తగ్గొచ్చు. మధ్యాహ్నం భోజనం సమయంలో అన్నం తగ్గించి ఇలాంటి రొట్టెలు తీసుకోవచ్చు. లేదా సాయంత్రం త్వరగా ఈ రొట్టెలతోనే డిన్నర్ చేయొచ్చు.

రాగి రొట్టె తయారీ…

ఒక గిన్నెలో అరకప్పు రాగిపిండిని వేయాలి. చిటికెడు ఉప్పు, వేడి నీళ్లు వేసి చపాతీ పిండిలా కలపుకోవాలి. చిన్న ఉండలుగా చేసుకుని, ఒత్తుకుని కాల్చుకోవాలి. దీన్ని ఏ కూరతో తిన్నా టేస్టుగా ఉంటుంది.

జొన్నరొట్టె ఇలా చేసుకోండి…

పెద్ద గిన్నెలో అరకప్పు జొన్న పిండి కలపాలి. చిటికెడు ఉప్పు వేసి వేడి నీళ్లు కలుపుతూ రొట్టె పిండిని తయారుచేయాలి. కాసేపు మూత పెట్టి పక్కన పెట్టాలి. దీన్ని చపాతీలా కలుపుకుని పెనంపై రెండు వైపు కాల్చుకోవాలి. చేత్తో ఒత్తుకునే చపాతీలా చేసుకుంటారు. మీకు ఎలా వీలైతే అలా రోటీలా చేసుకోండి. ఈ రోటీని వేడిగా ఉన్నప్పుడే ఏదైనా కర్రీతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

ఈ రెండు రోటీల్లో ఏదో ఒకదాన్ని రోజుకు రెండు చొప్పున తినడం వల్ల బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడుతుంది. పోషకాహార లోపం కూడా రాదు. నెలలో అయిదు కిలోల వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.