సిద్ధిపేటకు దిష్టి తీయాలే : మంత్రి హరీష్ రావు

-

సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని వైద్యారోగ్య, ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సిద్ధిపేటకు దిష్టి తీయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సిద్ధిపేట అభివృద్ధిపైనే మాట్లాడుతున్నారని చెప్పారు మంత్రి హరీశ్ రావు. హరీశ్ రావు సిద్ధిపేటనే బాగా అభివృద్ధి చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తనను విమర్శిస్తున్నారని, అయితే అవేమీ తాను పట్టించుకోనని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని, కానీ స్థానిక ఎమ్మెల్యేగా సిద్ధిపేటను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. పేదల కోసం సిద్దిపేటలో 900 పడకల ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని తెలిపారు మంత్రి హరీశ్ రావు.

TRS look towards the trouble shooter Harish Rao in Huzurabad

 

కరోనా వల్ల రెండేళ్లు ఆర్ధికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నామన్న మంత్రి… త్వరలోనే డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తామని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మహిళలకు పెద్దగా రుణాలు ఇచ్చింది లేదని, కానీ తమ హయాంలో వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సీసీ రోడ్లతో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అలాగే చెత్త నుంచి ఎరువుల తయారు చేసి గ్రామాలు స్వయం సమృద్ధి సాధించేందుకు తోడ్పాటు అందిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news