అతిగా నిద్రపోతే ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట..!

-

కొంతమంది నిద్రరాక బాధపడుతుంటారు.. పాపం వాళ్లు ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్రపట్టదు.. ఆ సమస్యకు ఉండే కారణాలు వేరు.. అలాగే ఇంకొంతమంది అతి నిద్రతో బాధపడుతుంటారు. కంటినిండా నిద్రపోవడం మంచిదే.. కానీ ఎప్పుడూ నిద్రరావడం, అసలు బెడ్‌మీద నుంచి లేవబుద్దికాకపోవడం ఇలా ఉంటుంది. అతిగా నిద్రపోవడం వల్ల వచ్చే లాభాలకంటే నష్టాలే ఎక్కువ. రోజూ 8 గంటల కన్నా.. ఎక్కువ గంటలపాటు నిద్రపోతే అది ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తక్కువ నిద్రపోవడం వల్ల మనిషికి అనేక వ్యాధులు వస్తాయి. కానీ ఎక్కువ నిద్రపోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు మీరు అవసరమైన దానికంటే ఎక్కువ నిద్రపోతే, స్ట్రోక్ సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి మీకు ఎక్కువగా నిద్రపోయే అలవాటు ఉంటే ఈరోజే మార్చుకోండి.

డిప్రెషన్ సమస్య- మీరు డిప్రషన్‌ వల్ల నిద్రలేమి ఉంటుందని విని ఉంటారు కానీ ఇదేంట్రా అనుకుంటున్నారా.. కొంతమంది కోపం, బాధలో ఉంటే అన్నం తినరు.. కానీ ఇంకొంతమంది మూడ్‌ బాలేనప్పుడే ఎక్కువగా తింటారు. ఇదీ అంతే.. అతిగా నిద్రపోవడం వల్ల అది మెదడుపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఒక వ్యక్తి డిప్రెషన్‌లోకి కూడా వెళ్లవచ్చు. ఎందుకంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల మనిషి శారీరక శ్రమ తగ్గుతుంది. దీని కారణంగా మీ మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది.

ఊబకాయం సమస్య: ఎక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయానికి గురయ్యే అవకాశం పెరుగుతుంది. రోజులో 8 గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులు చుట్టుముడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధుమేహం- అతిగా నిద్రపోవడం మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ నిద్రపోయినప్పుడు.. శరీరం చక్కెరను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మధుమేహానికి దారితీస్తుంది.

ఇన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి.. అతిగా నిద్రపోయే అలవాటును మానుకోండి. అయితే చాలామంది నైట్‌ షిఫ్ట్‌లు చేయడం వల్ల ఉదయం లేటుగా లేవడం తినేసి మళ్లీ పడుకోవడం ఇలా రోజులో సగం నిద్రకే కేటాయించి రాత్రి ఉదయించిన సూర్యుడిలా ఆఫీస్‌ వర్క్‌ నైట్ చేస్తుంటారు. నైట్‌ షిఫ్ట్‌ చేసే వారు ఎక్కువ సమయం పడుకోవచ్చు అయితే వీళ్లు కచ్చితంగా వ్యాయామానికి టైమ్‌ కేటాయించాలి..లేకపోతే ఊబకాయంతోపాటు చాలా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news