మీ పరుపులో ఈ లక్షణాలు ఉంటే వెంటనే మార్చేయండి.. లేదంటే చాలా ప్రమాదం

-

నిద్ర సుఖమెరగదు అంటారు.. కానీ సుఖంగా పడుకుంటే వచ్చే మజానే వేరు. మనిషి సరిగ్గా నిద్రపోకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడటం ఖాయం. నిద్రపోవాలంటే మనం తినే ఆహారంతో పాటు పడుకునే మంచం కూడా చాలా ముఖ్యమైనది. బెడ్‌ సరిగ్గా లేకపోతే అస్సలు నిద్రపట్టదు. పరుపు మరీ మెత్తగా ఉన్నా ఇబ్బందే. కొన్ని పరుపులు మీద పడుకున్నప్పుడు వీపుకు చెమట పడుతుంది. వాటి వల్ల చిరాకుగా అనిపిస్తుంది. మీ పరుపులు ఇప్పుడు చెప్పుకోబోయే లక్షణాలు ఉంటే వెంటనే వాటిని మార్చేయండి.

మీ శరీరంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీరు ఉదయం నిద్ర లేవగానే, మీ చేతులు, కాళ్ళలో నొప్పిగా ఉంటుంది. ఇలా రోజూ జరిగితే మీ పరుపు దాని సామర్థ్యాన్ని కోల్పోయిందని అర్థం. ఇది మీ వెన్నెముక సమస్యలను కలిగిస్తుంది. కీళ్ల చుట్టూ ఒత్తిడి.. తరచుగా వెన్నెముక సమస్యలు రావొచ్చు. ఇలా జరిగితే నిద్ర పట్టదు. మీరు తరచుగా మేల్కొంటారు.

మీ శరీరానికి పరుపు సరిపోకపోతే సమస్యలు వస్తాయి. శరీరానికి పరుపు సరిపోవడం ఏంట్రా అనుకుంటున్నారా..? అన్ని పరుపులు అందరికీ సరిపోవు. చిన్న పిల్లలకు, యువకులకు, వృద్ధులకు, వారి వయస్సును బట్టి పరుపును ఉపయోగించడం మంచిది. అధిక బరువు ఉన్నవారు కూడా చాలా చిన్నగా ఉండే పరుపులను ఉపయోగించకూడదు. యువకులు సాధారణంగా అన్ని రకాల పరుపులకు అనుగుణంగా ఉంటారు. కానీ వృద్ధులు, పిల్లలు పడుకునే మంచంపై శ్రద్ధ వహించాలి.

పరుపు తీసుకుని 8 సంవత్సరాల కంటే ఎక్కువ అయితే మార్చాల్సిందే. కొన్నిసార్లు మంచం ఏ పదార్థంతో తయారు చేయబడిందో దానిపై కూడా ఆరోగ్య(Health) పరిస్థితి ఆధారపడి ఉంటుందట.. సహజమైన పరుపును సరిగ్గా చూసుకుంటే చాలా సంవత్సరాలు ఉంటుంది. మీ పరుపు ఎనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే, అది కచ్చితంగా మార్చాల్సిందే. చూడ్డానికి బానే ఉందిగా అని అలానే వాడేయకండి. ఎందుకంటే ఎనిమిదేళ్ల తర్వాత ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అందులోని దుమ్ము, చెమట కణాలు ఆరోగ్యానికి ఇబ్బందిగా మారతాయి.

కుంచించుకుపోవడం అనేది పాత పరుపు అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. మీ పరుపు కుంగిపోవచ్చు, మృదువుగా లేదా మధ్యలో వంగి ఉండవచ్చు. అటువంటప్పుడు మీరు మంచం మీద పడుకుంటే, మీ తుంటిలో విపరీతమైన నొప్పి వస్తుంది. రాత్రంతా హాయిగా నిద్రపోవడం సాధ్యం కాదు. అందుకే మీ వెన్నెముక వంకరగా మారే అవకాశం ఉంది.

బెడ్ మీద పడుకునేటప్పుడు ఫ్యాన్, ఏసీ, కూలర్ లేదా తగినంత సహజమైన గాలి ఉండాలి. కొన్నిసార్లు వీపుతో సహా మొత్తం శరీరం వేడిగా అనిపిస్తుంది. ఇది పరుపు చేయడానికి ఉపయోగించే విస్కోలాస్టిక్ పాలియురేతేన్ రసాయనాల వల్ల కూడా వస్తుంది. ఇవి వేడిని నిలుపుకొంటాయి.

మంచం నుండి చాలా సార్లు చెడు వాసన వస్తుంది. అయితే దీని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఒకే బెడ్‌ను వాడుతుంటాం. ఇలా చేయడం తప్పు. ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీకు అనారోగ్యం కలిగించవచ్చు. వెంటనే మీ బెడ్ మార్చడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version