ఐరన్‌ లోపం ఉంటే కళ్లు ఇలా అయిపోతాయట..! వెంటనే వీటిని తినండి..!

-

మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మన కళ్లే చెప్పేస్తాయి. ఆరోగ్యం ఒక్కటే కాదు..మన మూడ్‌ బాలేకున్నా అది కళ్లలో తెలిసిపోతుంది. అందాన్ని, ఆరోగ్యాన్ని కళ్లను చూసి చెప్పేయొచ్చు. ఒక వ్యక్తి కళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే..ఆ మనిషి అంత ఆరోగ్యంగా ఉన్నట్లు.. బాడీలో రక్తం లేకుంటే కళ్లు తెల్లగా అయిపోతాయి. ఎర్రరక్తకణాలు తగ్గితే.. ఆ ప్రభావం కళ్లల్లోనే కనిపిస్తుంది. రక్తకణాలు సరిపడినంత లేవంటే మనలో ఐరన్ లోపించినట్లే.. శరీరానికి విటమిన్స్, ఖనిజాలు చాలా ప్రాముఖ్యం. ఇవి లోపిస్తే తరచుగా అలసటకి గురి కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీని ప్రభావం చాలా త్వరగా కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఐరన్ లోపం వల్ల రక్తం కంటి కణజాలాలకు తగినంత ఆక్సిజన్‌ను చేరవేయకుండా నిరోధిస్తుందని నిపుణులు అంటున్నారు. తద్వారా కళ్ళు పాలిపోయినట్లు ఉంటాయి. అందుకే వైద్యులు ముందుగా కళ్ళని పరిశీలిస్తారు. సాధారణంగా కళ్ళు లేత గులాబీ రంగులో కనిపిస్తాయి. ఐరన్ లోపం ఉంటే కన్ను దిగువ భాగం తెల్లగా కనిపిస్తుంది. అంటే శరీరంలో ఎర్ర రక్త కణాలు సరిగా లేవని సంకేతం.

లక్షణాలిలా…

ఐరన్ లోపం వల్ల తేలికపాటి రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండకపోవచ్చు.. కానీ అధిక రక్తహీనతతో బాధపడే వాళ్ళులో మాత్రం అలసట, కళ్ళు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవే కాకుండా చేతులు, కాళ్ళు చల్లగా మారిపోవడం, చర్మం, గోళ్ళు, నాలుక ఎర్రగా లేకుండా పాలిపోయినట్లు ఉంటాయి.

రక్తహీనత ఉందని ఎలా తెలుసుకోవటం..

వైద్యులు రోగనిర్ధారణ పరీక్ష ఎఫ్ బిసి(ఫుల్ బ్లడ్ కౌంట్) ద్వారా తెలుసుకుంటారు. రక్తపరీక్షలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎంత ఉంది, హిమోగ్లోబిన్, ఫెర్రిటిన్ స్థాయిలు ఎంత ఉందనే విషయం తెలుస్తోంది. శరీరంలో ఐరన్ నిల్వ చెయ్యడంలో సహాయపడే ప్రోటీన్ ఫెర్రిటిన్. ఎఫ్ బీసీ పరీక్ష ద్వారా ఇవన్నీ తెలుస్తాయి.

ఐరన్ స్థాయి పెంచే ఆహారాలు ఇవే..

శరీరానికి తగినంత ఐరన్ పొందేందుకు రెడ్ మీట్, సీ ఫుడ్, బీన్స్, బచ్చలికూర వంటి ముదురు ఆకు కూరలు, డ్రైఫ్రూట్స్, బ్రెడ్‌, పాస్తా వంటి ఐరన్-ఫోర్టిఫైడ్ తృణధాన్యాలు ఆరోగ్యకరమైనవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version