బరువు తగ్గాలా..? అయితే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోండి..!

చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు అధిక బరువు సమస్య నుండి బయట పడాలన్నా బరువు తగ్గాలన్నా ఈ ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది ఈ ఆహార పదార్థాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు. కాళీ కడుపుతో వీటిని తీసుకుంటే బరువు తగ్గొచ్చు. మరి వేటిని తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు:

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదని దీనిని ఉదయాన్నే తీసుకుంటే చాలా చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. మంచి ప్రోబయోటిక్ ఫుడ్ ఇది. కాబట్టి మీరు దీన్ని తీసుకుంటూ ఉండండి. డైజిటివ్ సిస్టం కూడా బాగా పని చేస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కావాలంటే మీరు పెరుగులో కొన్ని ఫ్రూట్స్ వేసుకుని తీసుకోవచ్చు.

ఓట్స్:

ఆరోగ్యానికి చాలా మంచివి ఓట్స్. వీటిని కూడా మీరు తీసుకుంటూ ఉండండి ఉదయాన్నే ఖాళీ కడుపు తో ఓట్స్ ని. తీసుకుంటే జీర్ణం బాగా అవుతుంది పోషక పదార్థాలు కూడా అందుతాయి. బరువు తగ్గడానికి కూడా అవుతుంది.

అరటి పండు:

అరటి పండు ఆరోగ్య నికి చాలా మేలు చేస్తుంది. ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి కాళీ కడుపుతో అరటి పండును తీసుకుంటే కూడా బరువు తగ్గొచ్చు. అలానే గుడ్లు, బాదం, ఆకుకూరలు కూడా మీరు ఖాళీ కడుపుతో తీసుకోండి ఇవి కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే మీరు మీ శరీర తత్వాన్ని బట్టి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి. కొంత మందికి కొన్ని పడవు కాబట్టి వాటిని బట్టి మీరు ఆహారాన్ని తీసుకోవడం మంచిది.