మెట్రోలో ప్రయాణించేవారికి ఈ సమస్యలు వస్తాయాట.. తస్మాత్‌ జాగ్రత్త..!

-

సిటీల్లో ఉండేవారికి మెట్రోలో ప్రయాణం కొత్తేమి కాదు.ట్రాఫిక్‌ కష్టాలు లేకుండా ఈజీగా వెళ్లిపోవచ్చు. పైగా టికెట్‌ కాస్ట్‌ కూడా తక్కువే. మెట్రోలో ప్రయాణించడం వల్ల సమయం అలాగే డబ్బు ఆదా అవుతుంది.. కానీ ఈ జర్నీతోనూ కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మధ్య వయస్కుల వారు మెట్రో జర్నీలో కొన్ని జాగ్రత్తలు పాటించాలట.. అవేంటంటే..

ఎక్కువ సేపు నిలబడి దూర ప్రయాణాలు చేయడం వల్ల ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా సీటు దొరకనప్పుడు ఒకే పోజిషన్‌లో నిలబడి ప్రయాణించడం వల్ల పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలాగే కొంతమంది బరువైన బ్యాగులను భుజాలపై వేసుకుని అలానే నిలబడతారు. ఇది ఎముకల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు కూడా రావొచ్చు.

కొన్ని సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అదంటేంటే నిలబడి ఉన్నప్పుడు పొజిషన్‌ మార్చుతూ ఉండాలి. అలాగే బ్యాగ్‌లను నేలపై ఉంచి జర్నీ చేయాలి. ఎవరైనా తీసుకెళ్లిపోతారేమో అన్నట్లు ఎంతదూరమైన మీ బ్యాగ్‌ను అలానే మోస్తే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

గుండె సమస్య..

నిత్యం రద్దీ , గుంపుల్లో ప్రయాణాలు చేసేవారు త్వరగా అలసిపోతారు. ఒత్తిడికి గురవుతారు.. ఇది క్రమంగా మానసిక ఆరోగ్యానికి దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రద్దీగా ఉండే మెట్రోలో ప్రయాణించడం వల్ల శరీరంలో సెరోటోనిన్ స్థాయులు పెరుగుతాయి. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపతుంది.

ఈ సమస్యలను అధిగమించాలంటే ఒత్తిడికి గురైనప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. అలాగే మనసుకు నచ్చిన పనులు చేస్తూ బిజీగా ఉండండి. గుండె సమస్యే కాదు..డైలీ రద్దీ ప్రయాణాలు చేయడం వల్ల చాలామందిలో రక్తపోటు పెరగడం లేదా తగ్గడం మొదలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయంటున్నారు.

కాబట్టి..జర్నీని ఎంజాయ్‌ చేయడానికి ట్రై చేయండి. మీకు మీరే అనవసరంగా చిరాకు పడటం లాంటివి అస్సలు చేయకండి. నిలబడాల్సి వస్తే అలానే నుల్చోకుండా పొజిషన్‌ మార్చండి. బరువైన లగేజీ ఉంటే నేలపై పెట్టండి. స్లో మ్యూజిక్‌ ఏదైనా వినండి. మరీ ఎక్కువ సౌండ్‌ పెట్టి వింటే మళ్లీ అదో సమస్య!

Read more RELATED
Recommended to you

Latest news