పొట్ట వలన పురుషుల్లో చాలా సమస్యలు వస్తాయి. మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది పురుషుల్లో బెల్లీ ఫ్యాట్ సమస్య ఎక్కువగా వస్తోంది. బెల్లీ ఫ్యాట్ కారణంగా అనేక సమస్యలు వస్తాయి. బాడీ మాస్ ఇండెక్స్ 40 కంటే ఎక్కువగా ఉండే వాళ్ళల్లో గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నట్లయితే రక్తప్రసరణ సరిగ్గా జరగదు. గుండె సమస్యలు వస్తాయి. పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ ఉండటం వలన ప్రోస్టేట్ సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఉబకాయం, పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోవడం వలన డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. పొట్ట ఉన్న పురుషుల్లో షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఇరవై ఏడు శాతం ఎక్కువ ఉంటుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వలన రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. బెల్లీ ఫ్యాట్ ఉన్నవాళ్లలో ఆస్ట్రో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
పొట్ట తాలూకా అదనపు భారం కాళ్లపై పడుతుంది. దీంతో ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. అలాగే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా చేయడం వలన కొవ్వు కరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ రావడానికి ఇంకొక కారణం ఒత్తిడి పెరిగిపోవడం. కార్టిసాల్ అధికంగా ప్రొడ్యూస్ అవుతుంది దీంతో సమస్యలు వస్తాయి. సరైన ఫుడ్ ని తీసుకుంటూ ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తింటూ ఉండాలి.