ఊపిరితిత్తులలో ఇబ్బందులా..? అయితే ఇలా శుభ్రం చేసేయచ్చు..!

-

ఆరోగ్యం అనేది ఎంతో ముఖ్యమైనది. ఎప్పుడూ కూడా వీలైనంత ఆరోగ్యంగా ఉండడానికి మనం చూడాలి. ఈ మధ్య కాలం లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ అనారోగ్య సమస్యలు మీ దరిచేరకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలు దరి చేరకూడదు అంటే ఆరోగ్యకరమైన పద్ధతులను ఫాలో అవుతూ ఉండాలి.

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల పద్ధతుల్ని అనుసరిస్తే సరిపోతుంది. ఊపిరితిత్తుల లో మలినాలని దూరం చేయడానికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు వీటిని తీసుకోవడం వలన ఊపిరితిత్తుల్లో పేర్కొన్న చెత్త బయటకి వస్తుంది దానితో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేందుకు అవుతుంది.

తేనే:

తేనె ఊపిరితిత్తులలోని మలినాలని బయటకి తీసుకు వచ్చేస్తుంది. అలానే క్యాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్ కూడా ఇందులో ఉంటాయి. గోరువెచ్చని నీళ్లలో తేనె కలిపి తీసుకుంటే… ఊపిరితిత్తుల లో ఇన్ఫ్లమేషన్ దూరం అవుతుంది. అలానే క్లీన్ గా ఉంటాయి.

పసుపు:

పసుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపులో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. కర్కుమిన్ కూడా ఉంటుంది. ఊపిరితిత్తులలోని విష పదార్దాలు తొలగిపోతాయి. అలానే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు కూడా వుండవు.

గ్రీన్ టీ:

ఆరోగ్యానికి గ్రీన్ టీ కూడా మంచిదే. గ్రీన్ టీ ఊపిరితిత్తులను బాగా క్లీన్ చేస్తుంది. అలానే ఇతర లాభాల ని కూడా దీని వలన పొందొచ్చు.

అతిమధురం:

ఇది కూడా ఊపిరితిత్తులను బాగా క్లీన్ చేస్తుంది. శ్వాసకోశ సమస్యలు, దగ్గు, జలుబు వంటి ఇబ్బందులు వుండవు. ఉపిరితిత్తులలోని విషపదార్థాలు తొలగిపోతాయి. ఇలా మీరు ఈ టీ ల ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా వుంచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news