కుంకుమ పువ్వు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారా..?

-

గర్భిణీలు ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పోషకాహారాన్ని తీసుకోవడంతో పాటుగా రెగ్యులర్ హెల్త్ చెకప్స్, స్కానింగ్ వంటి వాటిని మిస్ కాకూడదు. అలాగే గర్భిణీలు కుంకుమపువ్వు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారని అందరూ చెప్తూ ఉంటారు. సాధారణంగా గర్భిణీలలో జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయి. కుంకుమపువ్వు తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. గర్భిణీల్లో వేవిళ్ల సమస్య రావడం సర్వసాధారణం. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆ సమస్య తగ్గుతుందట అలాగే గర్భం దాల్చిన వారిలో మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ వంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి.

కుంకుమ పువ్వు ని తీసుకుంటే ఐరన్ బాగా అందుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. బీపీ కూడా కాదు. అదుపులో ఉండడానికి కుంకుమపువ్వు సహాయం చేస్తుంది. ఇవే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా కుంకుమపువ్వు ఉపయోగపడుతుంది. అలర్జీలు ఇన్ఫెక్షన్లు రాకుండా కుంకుమపువ్వు చూసుకుంటుంది. గర్భిణీలలో జుట్టు రాలిపోవడం పెద్ద సమస్య. అలాంటప్పుడు కుంకుమపువ్వు తీసుకుంటే జుట్టు రాలిపోకుండా ఉంటుంది. జుట్టు దృఢంగా, బలంగా మారుతుంది.

కుంకుమపువ్వు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారా లేదా అనేది పక్కన పెడితే ఇన్ని లాభాలని గర్భిణీలు పొందవచ్చు. కాబట్టి కుంకుమ పువ్వుని తీసుకోవడం మంచిది. ఎంత మోతాదులో తీసుకోవాలి. ఎన్ని సార్లు తీసుకోవాలి అనేది ఆరోగ్య నిపుణులు సలహా మేరకు తీసుకోవడం మంచిది. అలాగే గర్భిణీలు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు వంటివి తీసుకోవాలి. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. వాటితో పాటుగా వైద్యుని సలహా మేరకు వాకింగ్, యోగా వంటి వాటిని ఫాలో అవ్వండి. మానసిక ప్రశాంతత కూడా ముఖ్యం. కాబట్టి రోజు కాసేపు ధ్యానం చేయడం కూడా చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version