రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్ తీసుకోండి.. ఒంట్లో వేడి తగ్గిపోతుంది..!

-

రాత్రి: రాత్రి నిద్ర పోయేటప్పుడు మనం కొన్ని పద్ధతుల్ని ఫాలో అయితే మనకు నిద్ర బాగా పడుతుంది అలానే ఆరోగ్యం కూడా బాగుంటుంది. వేసవి కాలంలో రాత్రి పూట మీరు ఈ డ్రింక్ ని తీసుకుంటే ఒంట్లో వేడి మొత్తం తొలగిపోతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. దానితో ఎంతో చికాకు ఉంటుంది. పైగా బాగా చెమట కూడా పడుతూ ఉంటుంది. వేసవి లో దాహం కూడా ఎక్కువగా వేస్తుంది అలసట వంటివి కలుగుతూ ఉంటాయి.

వేసవిలో ఇమ్యూనిటీ కూడా బాగా తగ్గుతుంది. ఉదర సంబంధిత సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలానే అతిసారం తలనొప్పి వంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అయితే వాతావరణం ఇలా మారినప్పుడు ఆహార విషయంలో కొన్ని మార్పులు చేయాలి. వేసవి లో వీటిని తాగితే చాలా మంచి కలుగుతుంది. వేసవిలో అరటి గుజ్జు రసం తాగడం మంచిది. అరటిపండు గుజ్జులో ఎన్నో పోషకాలు ఉంటాయి ఎండాకాలంలో అరటి పండు రసం తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు.

గుల్కన్డ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. రాత్రి నిద్ర పోయేముందు గుల్కన్డ్ మిల్క్ తీసుకుంటే బాడీ చల్లగా ఉంటుంది మంచి నిద్ర పడుతుంది. వేసవి లో ఎండ ఎక్కువ ఉంటుంది కనుక ఆ వేడిని తట్టుకోవడానికి చెరుకు రసం కూడా తీసుకోవచ్చు చెరుకు రసాన్ని కూడా తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుంది పైగా తక్షణ ఎనర్జీని పొందొచ్చు. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి మంచినీళ్లు ని వేసవిలో ఎక్కువ తీసుకోవడం వలన డిహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఉండవు మజ్జిగ నిమ్మరసాన్ని కూడా వేసవిలో ఎక్కువగా తీసుకోవచ్చు వీటి వలన కూడా ఇబ్బందులు లేకుండా ఉండచ్చు. ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news