కిడ్నీలు మనకున్న పార్ట్స్ చాలా అంటే చాలా ముఖ్యమైనవి.. ఇవి డామేజ్ అయితే మళ్లీ నార్మల్ స్జేజ్‌కు రావు. అలా పాడైనవాటితోనే జీవితం నెట్టుకురావాలి. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. అయితే మనం ఎప్పుడూ ఈ కిడ్నీ రాళ్ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం.. కానీ మీకు తెలుసా.. సమ్మర్‌లోనే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉందట. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా..నష్టం తప్పదు మిత్రమా..! అసలు సమ్మర్‌కి కిడ్నీ స్టోన్స్‌కి ఏంటి రిలేషన్, నిపుణులు ఏమంటున్నారో చూద్దామా..!
వేసివిలో కిడ్నీ స్టోన్స్‌కు ప్రధాన కారణాలు..
వేసవిలో కిడ్నీ స్టోన్‌కు అతి పెద్ద కారణం ఉష్ణోగ్రత పెరగడం. ఉష్ణోగ్రత పెరగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.. డీహైడ్రేషన్ ఎఫెక్ట్ మూత్రపిండాలపై పడుతుంది. శరీరంలో నిరంతరం డీహైడ్రేషన్ సమస్య కారణంగా, కిడ్నీలో చిన్న స్ఫటికాలు ఏర్పడతాయి.
ఈ సీజన్‌లో వేడి బాగా ఉంది కదా అనీ..కూల్‌డ్రింక్స్ బాగా తాగుతారు.. కిడ్నీపై శీతలపానియాలు హానికరమైన ప్రభావం చూపిస్తాయి. ఇది కూడా స్టోన్స్‌కు కారణమవుతుంది.
ఈ సీజన్‌లో కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే సరీ…
ఎక్కువ నీరు త్రాగాలి: వేసవిలో నీరు ఎక్కువగా తాగాలి. బాడీకి సరిపడా నీళ్లు ఇవ్వకపోతే.. డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ కనీసం 4లీటర్లు అయినా నీరు త్రాగాలి. ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీలోని టాక్సిన్స్ బయటకు వెళ్లి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ కొంతమందికి అన్నీ నీరు తాగితే.. పొట్ట లూస్ అవుతుందని, అసలు ముందు అన్ని వాటర్ పట్టవని చెప్తుంటారు.. అలాంటి వారు..
జ్యూస్ తీసుకోండి. సీజనల్ పండ్లు ,కూరగాయల రసం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే కిడ్నీలో రాళ్ల నుండి కాపాడుతుంది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కూరగాయలనే మీ డైట్‌లో చేసుకున్న సరిపోతుంది.
వేసవిలో పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పైనాపిల్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. జీర్ణక్రియ కూడా బాగుంటుంది. పీచు పుష్కలంగా ఉండే పైనాపిల్ కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
కిడ్నీలు ఎర్ర రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది, అలాగే రక్తపోటును నియంత్రిస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
– Triveni Buskarowthu