పైల్స్ సమస్య నుండి బయట పడడానికి ఇంటి చిట్కాలు…!

చాలా మంది మహిళలు పురుషులు పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వున్నా వాళ్లకి నొప్పి కలగడం, దురద వేయడం, బ్లీడింగ్ వంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ రోజు దీని నుండి బయట పడడానికి కొన్ని ఇంటి చిట్కాలు చూద్దాం…

కలబంద:

కలబంద గుజ్జు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఈ సమస్యను తొలగించడానికి కూడా బాగా ఉపయోగ పడుతుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి అది ఇరిటేషన్ ను తగ్గిస్తాయి. అయితే సొంతంగా తయారు చేసుకునే స్వచ్ఛమైన అలోవెరా జెల్ ని మాత్రమే ఉపయోగించడం మంచిది.

కొందరికి అలోవెరా జెల్ పడకపోవచ్చు కాబట్టి ఒక సారి తెలుసుకోండి. ఫైల్స్ ప్రదేశం లో మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకునే ముందు మీ చేతి మీద కొద్దిగా అప్లై చేసుకుని ఒక రెండు నుండి మూడు రోజుల వరకు చూడండి. మీకు కలబంద ఎలర్జీ లేకపోతే అప్పుడు మీరు ఉపయోగించండి.

గోరువెచ్చటి నీటితో స్నానం:

గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల రిలీఫ్ ఉంటుంది లేదా మీరు టాయిలెట్ సీట్ ఉండే ప్లాస్టిక్ టాబ్ మీద కూర్చుని కూడా స్నానం చేయొచ్చు. 20 నిమిషాల పాటు ఇలా చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది.

ఐస్ ప్యాక్:

పైల్స్ కలిగే ప్రదేశంలో మీరు ఐస్ ప్యాక్ ని ఉపయోగించవచ్చు. 15 నిమిషాల పాటు ఐస్ ప్యాక్ ని వాడడం వల్ల మంచి రిలీఫ్ ఉంటుంది. డైరెక్ట్ గా స్కిన్ మీద ఇస్ పెట్టొద్దు. టవల్ లేదా క్లాత్ వంటివి వాడి అప్పుడు ఉపయోగించండి.

ఆహారం:

మీ డైట్ లో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్లు తీసుకోండి. దీనితో కాన్స్టిపేషన్ తగ్గుతుంది. కాన్స్టిపేషన్ కారణంగా ఈ సమస్య చాలా మందిలో వస్తుంది. బ్రోకలీ, చిలకడ దుంపలు, బీట్రూట్, ఆపిల్స్, కీరదోస వంటివి తినవచ్చు.

కాటన్ దుస్తులు:

టైట్ గా లేకుండా వదులుగా ఉండే బట్టలు వేసుకోండి ముఖ్యంగా కాటన్ బట్టలు వేసుకోండి.