చాలామంది ఎక్కువ సేపు కూర్చునే పని చేస్తూ ఉంటారు. కదలకుండా గంటల తరబడి మీరు కూర్చుంటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు. ప్రస్తుతం చాలామంది డెస్క్ జాబ్స్ చేస్తున్నారు. డెస్క్ జాబ్స్ అంటే ఎక్కువసేపు కూర్చొని పని చేయాల్సి ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం వలన అనేక సమస్యలు వస్తాయని గుర్తు పెట్టుకోండి. కదలకుండా ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వలన బరువు పెరిగిపోతారు. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం వలన శరీరంలో అదనపు కొవ్వు కరగదు. జీవక్రియ రేటు తరగదు. దీంతో ఉపకాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వలన మానసిక ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడి వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువసేపు కదలకుండా కూర్చుని పని చేయడం వలన డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కూర్చొని ఉంటే జీవక్రియ రేటు తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అంతేకాకుండా కూర్చుని పని చేయడం వలన కాళ్ల దగ్గర నరాల వాపును ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనినే వెరికోస్ వెయిన్స్ అంటారు. రక్తం గడ్డ కడుతుంది. దీంతో శిరలు వాపు వస్తుంది.
కూర్చుని పనిచేసే వాళ్లు మధ్యమధ్యలో లేస్తూ ఉండాలి. లేదంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గుండె సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువవుతున్నాయి. కాబట్టి మధ్య మధ్యలో లేస్తూ ఉండాలని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వలన కాళ్లు బలహీనంగా మారిపోతాయి. ఒకే చోట కూర్చుని ఉంటే కండరాలు పట్టేస్తాయి. కాళ్లు బలహీనంగా మారిపోతాయి. కూర్చుని చేసే జాబ్ అయితే కచ్చితంగా ప్రతి అరగంటకి లేదా గంటకి ఒకసారి లేచి వాకింగ్ చేయండి లేదంటే ఈ సమస్యలు తప్పవని గుర్తుపెట్టుకోండి.