యోగా ప్రయోజనాలు అనేవి చాలానే ఉంటాయి గాని మనకుతెలియక దానికి దూరంగా ఉంటాం. యోగా చేస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ చెప్పవచ్చు. తాజాగా అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు యోగా వలన ఎన్నో విషయాలు చెప్పారు. యోగా చేస్తే మంచి నిద్ర ఉంటుందని చెప్పారు. మానసిక కుంగుబాటుతో బాధపడుతున్న 30 మందిని ఎంపిక చేసుకున్నారు.
వారిపై మూడు నెలల పాటు అనేక పరిశోధనలు చేసారు. రెండు గ్రూపులుగా విభజించి… మొదటి గ్రూపులోని వారిని వారానికి మూడుసార్లు, రెండో గ్రూపు వారితో వారానికి రెండుసార్లు చొప్పున మూడు నెలల పాటు యోగా చేయించారు. యోగా మొదటిపెట్టిన తొలిరోజు.. చివరిరోజు వారి మెదళ్లను ఎంఆర్ఐ స్కాన్ చేయగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. వారిలో మానసిక సమస్యలు తగ్గాయని గుర్తించారు.
వారానికి గంటపాటు యోగా చేయడం వల్ల మెదడులోని నాడీ వ్యవస్థలో సందేశాల బదిలీలో కీలకంగా పనిచేసే ‘గమ్మా అమినో బ్యూటైరిక్ యాసిడ్ మోతాదు పెరగడాన్ని తమ పరిశోధనల్లో వారు గుర్తించారు. అయితే ఆ యోగా సెషన్ ముగిసి నాలుగు రోజుల తర్వాత గాబా స్థాయి బాగానే ఉంది. కానీ ఎనిమిది రోజుల తర్వాత నాడీ కణాల్లోని గాబా స్థాయి పెరగలేదని పరిశోధనలో వెల్లడైంది. కాబట్టి వారానికి ఒకసారి యోగా చేస్తే మానసిక సమస్యలు ఉండవట.