తల్లి ప్రేమ ముందు ఏ ప్రేమ సాటిరాదంటారు.. కానీ అది కేవలం కన్న తల్లి అయితేనే… పేరుకు తల్లే అయినా.. సవతి తల్లుల్లకు వేరే వాళ్ల బిడ్డమీద ప్రేమ ఉండదు. ప్రేమ ఉండకపోతే సరే.. కానీ పగ ఉంటే..! హింసిస్తే.. యాసిడ్ పోస్తే.. ఆ బాధను భరించలేక రోడ్డు మీద పిచ్చిదానిలా పరుగెత్తిన ఓ యువతి.. నేడు ఎన్నో సర్జరీల తర్వాత.. తన కాళ్ల మీద తాను నిలబడే స్టేజ్‌కు ఎదిగింది. ఈమె కథ నేడు ఎంతోమందికి ఆదర్శం..ఆత్మస్థైర్యంతో అడుగులేసిన ఆ అమ్మాయి జీవితంలో ఎదురైన చేధు ఘటనలు మీరు చూడండి.!
పేద కుటుంబంలో పుట్టిన రూపకు తమ్ముడు పుట్టాడనే తల్లి చనిపోయింది. ఇద్దరు పిల్లలనెలా ఒంటరిగా సాకుతావంటూ తండ్రిపై బంధువుల ఒత్తిడి కట్ చేస్తే.. రూపకు సవతి తల్లిని తెచ్చింది. రెండో వివాహమైన తర్వాతే.. ముందు భార్యకు పిల్లలున్నారని తండ్రి చెప్పడం సవతితల్లి భరించలేక, ఆ కోపాన్ని చిన్నారులిద్దరిపై చూపించేది. దాంతో యూపీ, ముజ్‌ఫర్‌నగర్‌కు చెందిన రూప జీవితం దుర్భరమైంది.
ఇంట్లో పనంతా చేస్తేనే తమ్ముడికి, తనకు గుప్పెడన్నం పెట్టేది ఆ పినతల్లి. చదువుకోవాలని ఉన్నా స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి. ఎంత చాకిరీ చేసినా తల్లిపెట్టే హింస తగ్గలేదు. తమ్ముడి కోసం పాపం ఆ కష్టాలన్నీ పడేది. 15 ఏళ్లు కూడా నిండని ఆమెను ఓ రోజు పినతల్లి చితకబాదింది. తండ్రి పట్టించుకునేవాడు కాదు. ఒళ్లు తెలియని జ్వరంతో నిద్రపోతున్న రూపపై యాసిడ్ పోసింది ఆమె.. ముఖమంతా మండిపోతున్నట్లు అనిపించి కళ్లు తెరిచి చూడటానికి ప్రయత్నించినా, రెప్పలుకూడా తెరవలేనంత బాధ..అక్కడే ఉంటే ఇంకేం చేస్తుందో అని భయపడి, ఇంట్లోంచి ఒక్కసారిగా రోడ్డులోకి పరిగెత్తింది. రక్షించమంటూ ఏడుస్తున్న రూప దగ్గరకి గ్రామస్తులెవ్వరూ రాలేదు.
గ్రామ సర్పంచికి విషయం తెలిసి వచ్చి, ప్రభుత్వాసుపత్రికి తరలించాడట. ముఖం, భుజం కాలిపోయి బాధతో ఉన్న తనకు చికిత్స అందడానికి 16 గంటలు పట్టింది. ఆసుపత్రిలోనూ తన సవతితల్లి పండ్ల రసంలో విషం కలిపి చంపడానికి చూసిందట. అదృష్టం కొద్దీ అది తన తాగలేదు. దాంతో తప్పించుకున్నా. పోలీసులు ఆమెను జైల్లో పెట్టించినా నాలుగేళ్లలోపే తిరిగొచ్చి, తనను చంపడానికి మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టిందట. అక్కడ ఉంటే చంపేస్తుందని ఇల్లొదిలి పారిపోయిందట.
బంధువులింట్లో ఉంటూ.. చికిత్స చేయించుకునేది రూప. నాలుగైదేళ్లపాటు ఓ గదికే పరిమితమై ఉండిపోయిందీమె. బయటకొస్తే కాలిన తన ముఖాన్ని చూసి ఎదుటివాళ్లు వింతగా చూడటం భరించలేక.. బయటకు వెళ్లాలంటే ముఖం కప్పుకొని వెళ్లేది. ఓ సారి ఆసుపత్రిలో యాసిడ్ బాధితులకు చేయూతనందించే ఛాన్వ్ ఫౌండేషన్ గురించి ఎవరో చెప్పగా తెలుసుకొని వెళ్లి వాళ్లను కలిసింది. తన పరిస్థితి చెప్పి, నీడ కల్పించాలని కోరింది. వారిచ్చిన చేయూతతో అక్కడే ఉంటూ, ‘స్టాప్ యాసిడ్ అటాక్’ ప్రచారంలో పాల్గొంది.. యాసిడ్‌బాధితుల తరఫున అందరిలో అవగాహన కలిగించే దిశగా చేస్తున్న తన కృషికి అయిదేళ్ల క్రితం ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందించారు
ఎన్జీవో సాయంతో సర్జరీలు చేయించుకునే అవకాశాన్ని అందుకుంది. చికిత్సలతో పాటు కౌన్సెలింగ్ అందడంతో అప్పటి వరకు కుంగుబాటులో ఉండే రూప తిరిగి ఆత్మస్థైర్యాన్ని పొందింది.. ఎన్జీవో చేయూతతో ఓ కేఫ్‌లో ఉద్యోగాన్ని.. పొందగలిగింది. ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడ్డా అంటుంది రూప.
సంఘటన జరిగి 14 ఏళ్లైంది. ఇప్పటివరకు 16 సర్జరీలు కాగా, ఇంకా నాలుగైదు చేయించుకోవాల్సి ఉందట. ఈ కేఫ్‌లో అసిస్టెంట్ మేనేజర్ స్థాయికెదిగినట్లు చెప్పింది రూప.. అన్నింటకంటే.. ముఖ్యమైన విషయం.. ఇప్పుడు రూప తన ముఖం చూపించుకోవడానికి భయపడటం లేదు. టైలరింగ్ నేర్చుకుని… దుస్తుల డిజైనింగ్‌పై ఆసక్తి ఉంది. త్వరలో బొటిక్ తెరవాలనుకుంటుంది.. ఎప్పుడూ జరిగిన తప్పుకు రూప జీవితం అంతా పాడైంది. చాలామంది.. భార్య చనిపోగానే.. రెండో పెళ్లికి రెడీ అయిపోతారు. ముందు వెనకా ఆలోచించకుండా మీ స్వార్థం కోసం చేసుకునే పెళ్లి వల్ల అప్పటికే ఉన్న పిల్లలు నరకం అనుభవిస్తారు. దానికంటే.. హాస్టల్‌లో ఉంచడమే మేలు కదా..!