Success Story : ఒలింపిక్స్ లో ఇండియాకి మెడల్ సాధించిన రైతు బిడ్డ!

-

స్వప్నిల్.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నెట్టింటా ప్రశంసల వర్షంతో బాగా వైరల్ అవుతోంది. పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకి మెడల్ సాధించిన స్వప్నిల్ ప్రతిభను ఎంత మెచ్చుకున్నా కూడా తక్కువేనని నెటిజన్ల నుంచి అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విజయంతో స్వప్నిల్ ఎంతో మంది యువ క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తున్నారు.

అతను ఇండియాకి మూడో పతకం ఇవ్వడంతో అతనిపై అనేక రకాల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇక స్వప్నిల్ పూర్తి పేరు స్వప్నిల్ కుశాలే. మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. స్వప్నిల్ వయస్సు 28 సంవత్సరాలు. ఈయన రైతు బిడ్డ. రైతు కుటుంబంలో జన్మించిన స్వప్నిల్ కష్టపడుతూ ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి చేరుకుని ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో వార్తల్లో నిలిచారు. షూటింగ్ పై ప్రేమతో ఎన్నో కఠిన సవాళ్లకు ఎదుర్కొని మరీ స్వప్నిల్ ఈ విజయాన్ని సాధించారు.

ఇక 61 నేషనల్ ఛాంపియన్ షిప్ లో అయితే స్వప్నిల్ స్వర్ణ పతకం గెలవడం జరిగింది. స్వప్నిల్ ఇంకా మరెన్నో విజయాలను సాధించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు.పారిస్ ఒలింపిక్స్ లో స్వప్నిల్ మెన్స్ 3 పొజిషన్ షూటింగ్ ఫైనల్ లో మూడో స్థానంలో నిలవడం జరిగింది.ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసిన స్వప్నిల్ అవసరమైన టైంలో సత్తా చాటారు. ఒకానొక టైంలో స్వప్నిల్ 4, 5 స్థానాలలో కూడా కొనసాగారు.అయితే టాప్3 లోకి వచ్చిన తర్వాత స్వప్నిల్ అస్సలు వెనక్కి తగ్గలేదు. మొత్తం 451.4 పాయింట్లు సాధించి స్వప్నిల్ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.

ఈ పోటీలో చైనాకు చెందిన లి యుకున్ బంగారు పతకం కైవసం చేసుకోగా ఉక్రెయిన్ షూటర్ కులిష్ సెర్హియ్ రజత పతకం కైవసం చేసుకున్నారు. మూడు పొజిషన్లలో ఈ పోటీలు జరగగా ప్రోన్, నీలింగ్ ఇంకా స్టాండింగ్ షూటింగ్ చేయాల్సి ఉంటుంది.స్వప్నిల్ నీలింగ్ విభాగం షూటింగ్ లో మొత్తం 153.5 పాయింట్లు సాధించగా ప్రోన్ విభాగంలో 156.8 పాయింట్లు సాధించారు. ఇంకా స్టాండింగ్ విభాగంలో లో 141.1 పాయింట్లను సాధించారు.మొత్తానికి దేశానికి ఇంకో మెడల్ తీసుకోచ్చిన రైతు బిడ్డ స్వప్నిల్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version