కొడుకు ఐపీఏస్‌ అధికారి… తల్లిదండ్రుల జీవనం రేకుల షెడ్డులో..ఎందుకట్లా.!

-

ఐపీఏస్‌ అవడం అంటే అంత సామాన్య విషయం కాదు..ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి, మరెన్నో త్యాగం చేయాలి. ఓ సామాన్య కుటుంబం..పేదరికంలో మగ్గిపోయో ఓ తండ్రి కలను సాకారం చేయాడానికి కొడుకు పడ్డ కష్టం ఫలించింది. మొత్తానికి అనుకున్నది సాధించాడు..ఇంకేం ఉంది.వారి జీవితాలు మారిపోయాయి..చిన్న ఇళ్లు పోయి పెద్ద ఇళ్లు వచ్చేస్తుంది. కార్లు, బంగళాల్లో విలాసవంతమైన జీవితం వచ్చేస్తుంది. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే కథమాత్రం కాస్త ఢిఫ్రెంట్. కొడుకు ఐపీఏస్‌ అయినా..ఆ. తల్లిదండ్రులు జీవనం ఇంకా రేకుల షెడ్‌కే పరిమితం అయింది, ఆ తండ్రి ఇంకా కష్టం చేస్తూనే ఉన్నారు. ఇంతకీ ఎవరా ఆ కొడుకు..ఎంటా కథ చూద్దాం..!

కర్ణాటకలోని శ్రీకాంత్ (63), సావిత్రి (53) దంపతుల కుమారుడు జగదీశ్ అడహళి కుమారుడు ఉన్నాడు. ఇతను ప్రస్తుతం.. ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో ఐపీఎస్ ప్రొబేషన్ అధికారి. తమ కుమారుడిని ఈ స్థాయికి తీసుకురావడానికి ఆ దంపతులు పేదరికంలో ఉంటూ చాలా కష్టపడ్డారు. అనుకున్నది సాధించినప్పటికి..వారు రేకుల షెడ్డులోనే కాలం గడుపుతున్నారు.

శ్రీకాంత్, సావిత్రి దంపతులు కర్ణాటకలోని బెళగావి జిల్లా, కగ్వాడ్ తాలూకా, మోలే గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. పెద్ద కుమారుడు చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు పూర్తి చేశారు. అనేక కష్టాలను అధిగమించి తమ కుమారుడు జగదీశ్ యూపీఎస్‌సీ పరీక్షలో 440వ ర్యాంకు సాధించాడని చెప్పారు.

తండ్రి శ్రీకాంత్ సహకార చక్కెర మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తమ పిల్లలను చదివించేందుకు ఆయన అనేక చోట్ల అప్పులు చేశాట..శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం, మోలే గ్రామంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన జగదీశ్ పీయూసీ కోర్సును అథానీ పట్టణంలో చేశారు. ఆయన ఎస్ఎస్ఎల్‌సీలో 80 శాతం మార్కులు, పీయూసీలో 87 శాతం మార్కులు సాధించాట. తన కుమారుడు చార్టర్డ్ అకౌంటెంట్ అవాలనే ఉద్దేశంతో బీకామ్‌లో చేర్పించారు. సీఏ ఎంట్రన్స్ పరీక్షలో జగదీశ్ మంచి మార్కులే సాధించారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2013లో తన కారులో ప్రయాణించిన ఓ ఎన్నికల అధికారి యూపీఎస్‌సీ పరీక్షల గురించి చెప్పారు.

ఆ అధికారి మాటలు శ్రీకాంత్‌ను బాగా ప్రభావితం చేశాయి. తన కుమారుడిని ఒప్పించి…పరీక్షకు హాజరుకావాలని నచ్చజెప్పారు. అప్పు చేసి తన కుమారుడిని కోచింగ్ కోసం ఢిల్లీ పంపించారు. తండ్రి కష్టాన్ని కల్లారా చూసి ఎదిగిన జగదీశ్.. తన తండ్రి కలను సాకారం చేశారు. జగదీశ్ అంతకుముందు కేపీఎస్‌సీ పరీక్షలో 23వ ర్యాంకు సాధించారు. కలబురగిలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేశారు.

తాము పేదరికం వల్ల అనేక ఇబ్బందులు పడ్డామని, అయితే అదే పేదరికం తమను ఇంకా బలంగా మార్చింది..జగదీశ్‌ తల్లిదండ్రులు.. శ్రీకాంత్, సావిత్రి చెప్పారు. ఈ రేకుల షెడ్డు తమ కుటుంబం ఆశలకు చిహ్నమని చెప్పారు. ఆదాయం పెరిగినంత మాత్రానికి తాము ఈ జీవనశైలిని వదిలిపెట్టమని తెలిపారు. ఒంట్లో శక్తి ఉన్న అన్ని రోజులు..తాను డ్రైవర్‌గానే పని చేస్తూ..ఉన్న రెండు ఎకరాలు భూమిని సాగు చేస్తూ..జీవనం సాగిస్తామని శ్రీకాంత్‌ గర్వంగా చెప్పారు.

కొడుకును ఉన్నత శిఖరాలకు ఎక్కించి కూడా సాధారణ జీవితాన్నే గడపుతున్న జగదీశ్‌ తల్లిదండ్రులు ఎంతోమందికి ఆదర్శం. పేదరికం చదువుకు అడ్డుకాదని వీరి కుటుంబం మరోసారి నిరూపించింది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news