ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఉన్న సాలంది అనే గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న వాగును దాటాలి. దీంతో ఆ గ్రామ ప్రజలకు నిత్యం నరకం కనిపించేది.
ఎంత డబ్బు సంపాదించాం.. ఎంత విలాసంగా జీవిస్తున్నాం.. అనేది సరైంది కాదు.. సమాజంలో ఉన్న ఎంత మందికి మనం సహాయం చేశాం.. మన డబ్బు వల్ల ఎంత మందికి ఉపయోగం కలిగింది.. అన్నదే ముఖ్యం.. అవును, సరిగ్గా ఈ విషయాన్ని నమ్మాడు కాబట్టే ఆ పెద్దాయన తన తోటి గ్రామస్థుల కోసం ఏకంగా ఓ బ్రిడ్జినే నిర్మించాడు. రిటైర్ అయ్యాక తనకు వచ్చిన మొత్తం పెన్షన్ సొమ్ముతో తమ గ్రామానికి ఆయన బ్రిడ్జి నిర్మింపజేశాడు. ఆ ఊరి ప్రజల హృదయాల్లో దేవుడిగా కొలువుదీరాడు. ఆయనే.. ఒడిశాకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి గంగాధర్..
ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో ఉన్న సాలంది అనే గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలంటే ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న వాగును దాటాలి. దీంతో ఆ గ్రామ ప్రజలకు నిత్యం నరకం కనిపించేది. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఆ గ్రామస్థులు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. రోజుల తరబడి అలా వేచి చూడాలి. వాగు ప్రవాహం తగ్గేవరకు గ్రామంలోనే ఉండాలి. ఇదీ సాలంది గ్రామ ప్రజలు పడుతున్న అవస్థ. అయినప్పటికీ అక్కడి ప్రజా ప్రతినిధులు కానీ, అధికారులు గానీ సమస్యను పట్టించుకుని ఆ వాగుపై బ్రిడ్జి నిర్మించిన పాపాన పోలేదు.
అయితే అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గంగాధర్ ఆ గ్రామ ప్రజలు పడుతున్న అవస్థను గమనించాడు. దీంతో వెంటనే ఆయన స్పందించాడు. తనకు వచ్చిన పెన్షన్ సొమ్ము రూ.10 లక్షలతో ఆ గ్రామానికి బ్రిడ్జిని నిర్మింపజేశాడు. అతి త్వరలోనే ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కానుంది. దీంతో ఈ సారి ఆ గ్రామ ప్రజలు వర్షాకాలంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాగుపై ఉన్న బ్రిడ్జిపై రాకపోకలు సాగించవచ్చు. ఈ క్రమంలో గంగాధర్ దాతృత్వాన్ని ఆ గ్రామ ప్రజలు అందరూ మెచ్చుకుంటున్నారు. తమ సమస్యను పరిష్కరించేందుకు ఆ దేవుడే ఆయన్ను పంపాడని ఆ గ్రామ ప్రజలు ఆయన్ను అభినందిస్తున్నారు. ఏది ఏమైనా.. ఇలాంటి మానవత్వం ఉన్న మనుషులే కదా మన సమాజానికి కావల్సింది.. అప్పుడైనా మన సమాజం కొంత వరకు బాగు పడుతుంది.. అంతే కదా..!