జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పవన్‌కు పంపారు.
ఏపీ అసెంబీ ఎన్నికల్లో దారుణ ఓటమి అనంతరం జనసేన అధినేత పవన్ కొద్ది రోజులు సైలెంట్‌గా ఉన్నారు. ఇటీవలే ఆయన బయటికి వచ్చి ఇకపై రాజకీయాల్లో చురుగ్గా ఉంటామని, ప్రజల తరఫున సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని పవన్ అన్నారు. ఇక త్వరలో ఓ నూతన పక్ష పత్రికను ప్రారంభిస్తామని, తమ గళాన్ని జనంలోకి బాగా తీసుకెళ్తామని కూడా ఆయన అన్నారు. అయితే పవన్ భవిష్యత్ కార్యాచరణ మాటే ఏమో గానీ.. ఆయన పార్టీ నేతల్లో మాత్రం విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తోంది.
మరో 5 ఏళ్ల పాటు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉండి ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా పాల్గొందామని పవన్ అనుకుంటున్నా.. అది సాధ్యం కాదని జనసేన నాయకులు అనుకుంటున్నారట. ఏపీలో టీడీపీ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత ప్రభావం తమపై కూడా పడినందున.. మరో 2, 3 దఫాలు ఏపీలో జగనే సీఎంగా ఉంటారని కూడా జనసేన నాయకులు భావిస్తున్నారట. దీంతో వారిలో నమ్మకం సన్నగిల్లుతున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేయాలని చూస్తున్నారట. ఇక ఇవాళ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేనకు రాజీనామా చేసినట్లు తెలిపారు.
జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇవాళ ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పవన్‌కు పంపారు. తాను వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని లేఖలో చెప్పినా.. జనసేనలో బలం లేకపోవడం, ఆ పార్టీ అధికారంలోకి వస్తుందో, రాదోనన్న అపనమ్మకంతోనే రావెల రాజీనామా చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. కాగా రావెల ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానం నుంచి విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే రావెల రాజీనామా మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరుతారని, కాదు.. వైసీపీలో చేరుతారని ఓ వైపు జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఆయన కమలం పువ్వును చేతిలో ధరిస్తారో.. ఫ్యాన్ గాలి కింద కూర్చుంటారో త్వరలో తేలనుంది..!