57 ఏళ్ల ప్రియుడి కోసం 3.17 కోట్లు ఖర్చు పెట్టి ఎత్తు పెరిగేలా చేసుకున్న ప్రియురాలు

-

తమ ప్రేమను కాపాడుకోవడానికి ఏమైనా చేసే వారిని చూసి ఉంటాం. ప్రేమించిన వారికోసం మనలో మార్పులు చేసుకోవడం, వాళ్లకు నచ్చినట్లు ఉండటం ఇవి అన్నీ ప్రేమించినవాళ్లు చేస్తారు. కానీ ప్రేమించిన వ్యక్తి కోసం ఎత్తుపెరగాలని ఆపరేషన్ చేయించుకుంది ఓ యువతి. 57 ఏళ్ల ప్రేమికుడి కోసం…ఈ సాహసం చేసింది.. 3.17 కోట్లు ఖర్చు పెట్టింది. 8 సంవత్సరాలు పట్టింది తన అనుకున్న ఎత్తు పెరగడానికి..! ఇంతకీ ఆ యువతి ఎవరు, ఏంటా కథ చూద్దామా..!
జర్మనీలో నివాసముంటున్న మోడల్ పిచ్చి చూసి షాక్ అవుతున్నారు. ఎందుకంటే తన కంటే రెట్టింపు వయసున్న బాయ్‌ఫ్రెండ్ కోసం 3.17 కోట్లు ఖర్చు చేసి రెండు కాళ్ల ఎముకలకు సర్జరీ చేయించుకుంది. ఈ మోడల్ పేరు థెరిసియా ఫిషర్. ఆమె జర్మన్ రియాలిటీ టీవీ స్టార్. ఈ మోడల్ వయస్సు 32 సంవత్సరాలు. థెరిసియా కాలు సాగదీయడం కోసం భయంకరమైన శస్త్రచికిత్స చేయించుకుంది. ఈ సర్జరీలో కాలు ఎముక విరిగిపోయి కాలుకు రాడ్‌ని అమర్చారు. ఇది చాలా బాధాకరమైన శస్త్రచికిత్స మరియు దీన్ని చేయడానికి రెండు మూడు సంవత్సరాలు పడుతుంది.
ఈ మోడల్ కాలు శస్త్రచికిత్స 2016లో ప్రారంభమైంది, ఇది 2022లో ముగిసింది. 8 సంవత్సరాలు పట్టింది. ఫ్రీబర్గ్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స జరిగింది. ఎనిమిది సర్జరీల తర్వాత థెరిసియా ఇంటికి వచ్చింది. ఈ సర్జరీకి కాలు ఎముకలు విరిగి, ఎత్తు పెంచేందుకు రాడ్‌ని అమర్చి, ఆపై స్క్రూలతో బిగిస్తారు. ఎముకలను సాగదీయడం వల్ల కాలు పొడవు పెరుగుతుంది. దీంతో ఆమె కాలు ఇప్పుడు 5 అంగుళాల ఎత్తు పెరిగింది.
32 ఏళ్ల థెరిసియా తన కంటే రెట్టింపు వయసున్న స్టెఫాన్ క్లీజర్‌తో ప్రేమలో పడింది. థెరిసియా తన ఎత్తును పెంచితే.. తనను మరింత ప్రేమిస్తానని స్టీఫెన్ తెలిపాడు. స్టీఫెన్‌తో విడిపోయిన తర్వాత, థెరిసియా తన ప్రేమను కాపాడుకోవడానికి తన ఎత్తును పెంచడానికి శస్త్రచికిత్స చేయించుకుంది. 5.5 అంగుళాలు. ఇప్పుడు థెరిసా ప్రియుడు స్టీఫెన్ కూడా తిరిగి వచ్చాడు. ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version