స్నాక్స్, బిస్కెట్లు తింటున్నారా? ఇది చూస్తే అస్సలు తినరు..

-

ఈ మధ్య కాలంలో ఎక్కువమంది ఆహారంతో రకరకాల చిరు తిండిని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.. అదే ఇప్పుడు ఫ్యాషన్ అయ్యింది.స్నాక్స్ అంటే బిస్కెట్స్, చాక్లెట్స్, రకరకాల చిప్స్, కారపూస, స్వీట్స్ ఎక్కువగా తీసుకుంటారు..అయితే ఎక్కడైన కూడా స్నాక్స్ ను పిండి పదార్థాలు, కూరగాయల తో చెస్తారని అనుకోవడం అమాయకత్వం.. కొన్ని దేశాలలో కొన్ని రకాల ముడి పదార్థాలను వాడి తయారు చేస్తారు.కానీ ఇప్పుడు చెప్తూన్న స్నాక్స్ ను మాత్రం పురుగుల తో తయారు చేస్తారని అంటున్నారు.

ఏంటి.. వాక్..పురుగులతో తయారు చేస్తారా అని ఆశ్చర్య పోకండి.. మీరు విన్నది అక్షరాల నిజం. కానీ ఇది మన దేశంలో కాదులెండి..దక్షిణాఫ్రికా లో ఈ స్నాక్స్ ఉన్నాయి. వారికి ఆ పురుగులు తింటే ఆరోగ్యానికి మంచిదని నమ్ముతుంటారు.. అందుకే వాటిని అలా కూరలు చేసుకోవడం బదులు ఇలా స్నాక్స్ కూడా చేస్తారట..

అదేంటో వివరంగా చూద్దాం..క్యాటర్‌పిల్లర్‌ (గొంగళిపురుగు) నుంచి స్నాక్స్‌ తయారుచేసే విధానాన్ని రూపొందించారు దక్షిణాఫ్రికాకు చెందిన కెమికల్‌ ఇంజినీర్‌ వెండీ వెసెలా.నలుపు, ఆకుపచ్చటి రంగు పురుగుల్లో ఐరన్‌, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని, వాటిని తొలుత పిండిగా మార్చి, బిస్కెట్స్‌, చాక్లెట్లు వంటి స్నాక్స్‌ తయారుచేయొచ్చని ఆమె వివరించారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. వీటివల్ల పర్యావరణానికి ముప్పు లేదని చెబుతున్నారు..అందుకే వాటికి డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది..ఎంత ఆరోగ్యం ఉంటే మాత్రం చూస్తూ పురుగులను ఎలా తింటారో దేవుడా..

Read more RELATED
Recommended to you

Latest news