రోజంతా ఏసీ వాడుతున్నారా..? కరెంట్ బిల్ ని ఇలా తగ్గించుకోండి మరి..!

-

ఎండాకాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి. దాంతో ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండేందుకు రోజంతా ఏసీ ని వాడుతుంటారు. మీరు కూడా రోజంతా ఏసీని ఆన్ చేసి ఉంచుతున్నారా కరెంట్ బిల్ విపరీతంగా వస్తోందా..? అయితే కరెంట్ బిల్లు ఎక్కువగా రాకూడదు అంటే ఈ చిట్కాలని పాటించండి వీటిని కనుక మీరు పాటించారంటే కరెంట్ బిల్ బాగా తక్కువగానే వస్తుంది రోజంతా ఏసీ ని ఆన్ చేసి ఉంచినా కూడా ఈ విధంగా చేసి కరెంట్ బిల్ ని తగ్గించుకోవచ్చు.

ఎప్పుడూ కూడా ఏసీ ని తక్కువ ఉష్ణోగ్రతలో పెట్టకూడదు 16 లేదంటే 18° వద్ద ఉంచాలి అప్పుడు ఏసీ ద్వారా మంచి కూలింగ్ వస్తుంది. కరెంట్ బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు కాబట్టి ఏసీ ని ఎప్పుడు కూడా 24 లో ఉంచండి ఆరోగ్యంతో పాటు విద్యుత్ ని ఆదా చేయడానికి సరైన ఉష్ణోగ్రత ఎంచుకోవడం అవసరం. ఏసీ ని వేసినప్పుడు తలుపు కిటికీలని క్లోజ్ చేయండి చాలా మంది మరచిపోయి కిటికీలు తలుపుల్ని తెరిచి ఉంచుతారు దానితో చల్లగాలి అంతా బయటకు వెళ్ళిపోతుంది ఎక్కువసేపు ఏసి ఆన్ చేసి ఉంచినా కూడా చల్లగా ఉండదు గది. అందుకని ఈ తప్పుని అస్సలు చేయకండి.

చాలామంది రాత్రుళ్ళు ఏసి ఆన్ చేసి దుప్పటి కప్పుకుని పడుక్కుంటూ వుంటారు. అయితే అలా కాకుండా స్లీప్ మోడ్ ని ఉపయోగించండి చాలా ఏసీలలో ఈ ఫీచర్ ఉంటుంది. స్లీప్ మోడ్ ద్వారా మీరు కరెంట్ బిల్ ని ఆదా చేసుకోవచ్చు. ఏసీని ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేయండి. ఈ తప్పుని అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఫ్యాన్ ఆన్ చేయడం వలన ఏసీ గాలి గది లో అన్ని మూలలకి వెళుతుంది దీంతో వేసి ఉష్ణోగ్రత తగ్గించక్కర్లేదు ఇలా కరెంటు బిల్లు సేవ్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version