అర్ధరాత్రి మృతదేహం దగ్గర ఇద్దరు మహిళలు నగ్నంగా.. పిచ్చెక్కిస్తున్న సీసీటీవీ ఫుటేజ్‌

-

ఇంట్లో సీసీ కెమెరా పెట్టుకుంటే.. దొంగతనాలు జరగకుండా జాగ్రత్తపడొచ్చు అని తెలుసు కానీ.. ఇలా దెయ్యాలను కూడా క్యాప్చూచర్‌ చేయచ్చని మనకు ఇప్పటి వరకూ తెలియదు కదా. ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్న సీసీటీవీలో ఓ భయంకరమైన దృశ్యం రికార్డ్‌ అయింది. అది చూస్తే మళ్లీ ఆ దిక్కు వెళ్లాలంటే వెన్నులో వణుకుపడుతుంది. ఒక మృతదేహం అర్ధరాత్రి దగ్గర ఇద్దరు మహిళలు నగ్నంగా కుర్చోని తింటున్నారట.. ఇమాజిన్‌ అసలు ఇది ఎంత ఘోరంగా ఉంటుందో. ఆ ఫుటేజ్‌ చూసిన మహిళకు గుండె ఆగినంత పని అయింది. కెనడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఆమె ఓ నర్స్. ఆమె ఇల్లు ఉన్న ప్రాంతంలో తరచూ వన్య ప్రాణులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆమె తన ఇంటికి సీసీటీవీ కెమెరాను అమర్చింది. తాజాగా అందులో దృశ్యం ఆమెకు షాక్ ఇచ్చింది. ఇంటి దగ్గర్లోని చెట్టు దగ్గర ఓ జింక కళేబరం కనిపించడంతో… ఆ జింకను ఏ జంతువు చంపిందో చూద్దామని ఆమె సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించింది. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో ఇద్దరు మహిళలు.. ఆ జింకను తింటూ కనిపించారు. వారు నగ్నంగా ఉన్నారు. జుట్టు విరబూసుకొని దెయ్యాల్లా కనిపించారని ఆమె తెలిపింది.

వాళ్లు ఎవరు? జింకను వాళ్లే చంపేశారా? అనే డౌట్‌ ఆమెకు వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్‌లో వన్యప్రాణులు ఏవీ కనిపించలేదని ఆ నర్స్ తెలిపారు. అంటే వాళ్లే చంపేసి తిని ఉండొచ్చు. నగ్నంగా ఉన్న ఆ మహిళలు ఎవరు? వారు ఎందుకు అలా చేశారు? ఇప్పుడు ఎక్కడున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆ ఫుటేజ్ చుట్టూ తిరుగుతున్నాయి. వైరల్ అయిన ఆ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తుంది. జుట్టు విరబూసుకొని ఉండటంతో ఆ మహిళలు ఎవరన్నది ఎవరికీ తెలియట్లేదు. అసలు వాళ్లు అలా ఎందుకు చేశారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version