Chanakya Niti : ఆచార్య చాణక్య లైఫ్ లో ఎదురయ్యే ఎన్నో సమస్యల గురించి ఎంతో చక్కగా వివరించారు చాణక్య చెప్పినట్లు చేస్తే లైఫ్ లో ఏ సమస్య ఉండదు. ఆచార్య చాణక్య చెప్పినట్లు పాటిస్తే సమస్యలన్నిటినీ సులభంగా తరిమికొట్టేయొచ్చు. చాణక్య సమాజానికి ఉపయోగపడే విషయాలను ఎన్నో చెప్పారు. మనిషి జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది ఎంతో చక్కగా వివరించారు. అయితే చాణక్య ఎటువంటి ప్రదేశాల్లో ఉండకూడదు అనే విషయాన్ని కూడా చెప్పారు.
ఇటువంటి చోట ఉండడం అసలు మంచిది కాదు ఈ పొరపాట్లని మీరు కూడా చేయకండి. కొన్ని రకాల బాధల్ని ఎదురుకోవడం కంటే అక్కడ నుండి దూరంగా వెళ్లిపోవడమే మంచిది అలాంటి సందర్భంలో మీరు అక్కడ ఉండకుండా వెళ్లిపోండి. మన శ్రేయస్సుకి ముప్పు కలిగే చోట అసలు నివసించకండి. అక్కడి నుండి వెళ్లిపోండి.
కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఉండడం కంటే అక్కడి నుండి వెళ్లిపోవడమే మంచిది. మీరు నివసించే ప్రదేశంలో హింస అల్లర్లు వంటివి జరిగితే కూడా అక్కడ ఉండకూడదని ఆచార్య చాణక్య చెప్పారు. అటువంటి సందర్భాల్లో కూడా అక్కడి నుండి దూరంగా వెళ్లిపోండి. ఎందుకంటే ఎప్పుడైనా దాడి జరగచ్చు.
వెన్నుపోటు పొడిచే చోట కూడా అసలు ఉండకండి అటువంటి పరిస్థితులు వలన మీరు ప్రమాదంలో పడతారు. రెండు సైన్యాల మధ్య యుద్ధం జరిగే చోట కూడా ఉండకండి ఎందుకంటే అది చాలా ప్రమాదం. ఆర్థిక వ్యవస్థ బాగాలేని ప్రదేశంలో కూడా ఉండకూడదు ఆహారం దుస్తులు నివాసం వంటి కనీస అవసరాలు కూడా తీరవు.
నష్టాలని ఎదుర్కోవాలి. చెడ్డ వ్యక్తులు ఎక్కువగా ఉండే చోట కూడా ఉండకండి వాళ్లు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు నటిస్తారు వారి వలలో పడకూడదు. అవకాశం చూసుకుని హాని చేస్తారు అలానే నేరస్తులు ఉండే చోట కూడా ఉండకండి. ప్రమాదకరమైన జంతువులు ఉండే చోట కూడా అపాయం కలుగుతుంది. కాబట్టి చాణక్య చెప్పినట్లు చేస్తే జీవితం బాగుంటుంది లేకపోతే అనవసరంగా చిక్కుల్లో పడతారు.