కోకో కోలా.. ఫ్లేవర్ ఛేంజ్.. 36ఏళ్ల తర్వాత మరోసారి..

-

ప్రపంచ వ్యాప్తంగా కోకో కోలా బ్రాండ్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ దేశాలన్నింటిలో కోకో కోలా బ్రాండ్ విస్తృతంగా ఉంది. దాదాపు వంద యేళ్ల చరిత్ర ఉన్న కంపెనీ అయిన కోకో కోలా తన సొడా ఫ్లేవర్ మార్చనుంది. 1985లో ఒకసారి ఫ్లేవర్ మార్చిన కోకో కోలా మరోసారి మార్పులు చేయనుంది. కోకో కోలా బ్రాండ్ కి చెందిన కోకో కోలా జీరో షుగర్, పాపులర్ గా పిలవబడే కోక్ జీరో ఫ్లేవర్ లో మార్పులు జరగనున్నాయి.

ఈ విషయమై కంపెనీ ప్రతినిధులు వెల్లడి చేసారు. కోక్ జీరోని టేస్టుని మరింత రుచికరంగా మార్చడానికి, క్లాసిక్ టేస్ట్ కలిగించడానికి ఈ మార్పులు చేస్తున్నామని ప్రకటించారు. ఈ విషయంలో అమెరికన్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అయిష్టాన్ని వెలిబుచ్చుతున్నారు. చాలామంది పెప్సీ తాగుతామని, కోకో కోలా విడిచిపెడతామని అంటున్నారు.

1985లో మార్కెట్ పరిస్థితుల కారణంగా కోకో కోలా ఫ్లేవర్ లో మార్పులు తీసుకువచ్చారు. అప్పటి సోడాకి మరింత తియ్యదనాన్ని తగిలిస్తూ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చారు. అప్పట్లో ఈ ఫ్లేవర్ మార్పు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇంకా, కోకో కోలా అమ్మకాలు కూడా తగ్గాయి. ప్రస్తుతం చేస్తున్న మార్పుల్లో తయారీ పదార్థాలు ఏమీ మార్చడం లేదని, కార్బోనేటెడ్ నీళ్ళు, క్యారమెల్ కలర్, ఫాస్పారికామ్లం, ఆస్పర్టేమ్, పొటాషియం, కెఫైన్ మొదలైనవన్నీ ఉంటాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news