ప్ర‌పంచంలో ఏ దేశీయుల వ‌ద్ద బంగారం ఎక్కువ‌గా ఉందంటే..?

-

ప్ర‌పంచంలో అన్ని దేశాల క‌న్నా భార‌తీయుల వ‌ద్దే బంగారం ఎక్కువ‌గా ఉంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

అస‌లు పురాత‌న కాలం నుంచి భార‌తీయుల‌కు బంగారం అంటే మ‌క్కువ ఎక్కువ‌. మ‌హిళ‌ల‌కైతే బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అనేక మంది వ్యాపారులు జ్యువెల్ల‌రీ షాపుల‌ను ఏర్పాటు చేస్తూ ర‌క ర‌కాల ఆఫ‌ర్ల‌తో జ‌నాల‌ను ఆక‌ట్టుకుంటూ బంగారాన్ని విక్ర‌యిస్తున్నారు. అయితే బంగారం అంటే భార‌తీయులకు ఇష్టం స‌రే.. మ‌రి ప్ర‌పంచ వ్యాప్తంగా అస‌లు ఏ దేశం వారి వ‌ద్ద బంగారం ఎక్కువ‌గా ఉందో తెలుసా..? అదే ఇప్పుడు చూద్దాం.

ప్ర‌పంచంలో అన్ని దేశాల క‌న్నా భార‌తీయుల వ‌ద్దే బంగారం ఎక్కువ‌గా ఉంద‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. భార‌త్‌లోని సంప‌న్నుల ద‌గ్గ‌రే ప్ర‌పంచంలోని అంద‌రి క‌న్నా ఎక్కువ‌గా బంగారం ఉంద‌ట‌. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లోని అల్ట్రా హై నెట్‌వ‌ర్త్ ఇండివిడ్యువ‌ల్స్ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి. అలాగే చాలా మంది స్టాక్ మార్కెట్ క‌న్నా బంగారంపైనే ఎక్కువ‌గా పెట్టుబ‌డులు పెడుతున్నార‌ట.

ఇక బంగారంపై పెట్టుబ‌డులు పెడుతున్న వారిలో 14 శాతం మంది ఈ ఏడాదిలో ఆ పెట్టుబ‌డుల సంఖ్య‌ను మ‌రింత పెంచుతార‌ని కూడా ఓ స‌ర్వేలో తేలింది. గ‌తేడాది క‌న్నా ఇది 3 శాతం ఎక్కువ‌ట‌. కాగా ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారం లెక్క‌లు చూస్తే గ్లోబ‌ల్ యావ‌రేజ్ 2 శాతం ఉండ‌గా, ఆసియా యావ‌రేజ్ 3 శాతం ఉంద‌ట‌. అలాగే భార‌తీయ సంప‌న్నుల ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటా 4 శాతం ఉండ‌డం గ‌మ‌నార్హం.

కాగా చాలా మంది బంగారంపై పెట్టే పెట్టుబ‌డిని సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డిగా భావిస్తుంటారు. నిజానికి ఇత‌ర పెట్టుబ‌డుల్లో ఉన్న‌ట్లుగానే బంగారం ధ‌ర‌ల విష‌యంలోనూ అస్థిర‌త ఉంటుంది. కానీ దీర్ఘ‌కాలికంగా బంగారం ధ‌ర‌లు పెరుగుతూనే ఉంటాయి క‌నుక బంగారంపై పెట్టుబ‌డి పెడితే ఎప్ప‌టికైనా లాభాలే వ‌స్తాయి. అందుక‌నే భార‌తీయ సంప‌న్నులు చాలా మంది బంగారంపై పెట్టుబ‌డి పెడుతున్నారు.

ఇక మ‌న దేశంలో అనేక వ‌ర్గాల‌కు చెందిన‌ సంస్కృతి, సాంప్ర‌దాయాల్లో బంగారానికి విశేష‌మైన ప్రాధాన్య‌త క‌ల్పించారు. దీంతో మ‌న దేశంలో బంగారం వినియోగ‌దారులు మిగిలిన దేశాల క‌న్నా ఎక్కువ‌గానే ఉంటారు. అయితే ప్ర‌పంచంలో అంద‌రిక‌న్నా మ‌న దేశీయుల వ‌ద్ద‌నే బంగారం ఎక్కువగా ఉన్న‌ప్ప‌టికీ చాలా మంది అవ‌స‌రం ఉంటేనే భౌతికంగా బంగారం కొనుగోలు చేస్తున్నార‌ట‌. అవ‌స‌రం లేక‌పోతే బంగారం బాండ్స్ వైపు చూస్తున్నార‌ట‌. బంగారంపై పెట్టుబ‌డులు పెడుతున్నార‌ట‌.. ఏది ఏమైనా.. భార‌తీయుల‌కు బంగారం అంటే ఎంత ఇష్ట‌మో మ‌రోసారి రుజువైంది క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news