మ్యూఛువల్ ఫండ్లు: పెట్టుబడి పెట్టే ముందు పాత పర్ఫామెన్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా?

-

స్టాక్ మార్కెట్ అంటే భయపడే వారు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలంటే జంకుతారు. డైరెక్ట్ మార్కెట్ కి మ్యూచువల్ ఫండ్లకి తేడా ఉన్నప్పటికీ, ఆ తేడా ఏంటనేది సరిగ్గా అర్థం కాక పెట్టుబడి అనగానే పారిపోతుంటారు. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే ఎలాంటి విషయాలను పట్టించుకోవాలి? వేటిని పరిగణలోకి తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకోవాలి. లేదంటే మీరు పెట్టే పెట్టుబడి లక్ష్యం సరిగ్గా ఉండకపోవచ్చు. ముఖ్యంగా చాలామంది చేసే తప్పు ఒకటుంది.

ఒక ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనుకున్నవారు ఆ ఫండ్ అప్పటి వరకు ఇచ్చిన రిటర్న్స్ ని పరిగణలోకి తీసుకుంటారు. ఆ ఫండ్ మొదలై పదేళ్ళు అయ్యిందనుకుంటే, ఆ పదేళ్ళలో ఆ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది? దాని ఆధారంగా మరో పదేళ్ళలో ఎంత రిటర్న్ ఇవ్వవచ్చు అన్న అంచనాకి వస్తారు. కానీ మ్యూచువల్ ఫండ్లలో అలా అంచనాకి రావడం తప్పు. మ్యూచువల్ ఫండ్ల గురించి ప్రచారం వచ్చినపుడు చివర్లో ఒక సందేశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకి లోబడి ఉంటాయి అని.

అది ప్రతీ ఫండ్ కి వర్తిస్తుంది. మార్కెట్ ఒడొదొడులకి లోబడి ఉంటుంది కాబట్టి వచ్చే పదేళ్ళలో మార్కెట్ ఎలా ఉంటుందనేది ఎవ్వరూ అంచనా వేయలేరు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ల పాత పర్ఫామెన్సులని చూసుకుని పెట్టుబడి పెట్టకూడదు. చాలా ఫండ్లు మొదట్లో మంచి పర్ఫారర్మెన్స్ చూపి, ఆ తర్వాత డీలా పడిపోయినవీ ఉన్నాయి. మళ్ళీ అవే పైకి లేచి పర్ఫార్మెన్స్ లో దూసుకుపోయినవీ ఉన్నాయి. కాబట్టి మీరు పెట్టే ఏ ఫండ్ అయినా దాని ఫండ్ మేనేజర్ ఎవరు? ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఫోర్ట్ ఫోలియో ఏంటనే విషయాలు తెలుసుకోవడం మంచిది.

గమనిక: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్ ఒడిదొడుకులకి లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టేముందు స్కీముకి సంబంధించిన దస్తావేజులు జాగ్రత్తగా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version