వర్క్ ఫ్రమ్ హోమ్.. డ్రెస్సింగ్ విషయంలో నిర్లక్ష్యం.. పనిమీద ప్రభావం.. తాజా సర్వే..

-

కరోనా తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. అంతకుముందు అడిగితే తప్ప వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వని వారు ఇప్పుడు మొత్తం పనంతా ఇంటి నుండే చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కొత్త సమస్యలు పుట్టుకు వస్తున్నాయి. ఆఫీసులో వర్క్ చేసేటపుడు అక్కడ ఉండే పరిసరాలన్నీ పనికి దోహదం చేసేట్టుగా ఉంటాయి. ఆఫీసు అనగానే వర్క్ అని మైండ్ లోకి వచ్చేస్తుంది. అదే ఇంటికి రాగానే రిలాక్స్ అయిపోతాం. ఐతే ప్రస్తుతం పని, రిలాక్సేషన్ ఒకే దగ్గర కావడంతో ఏదీ సరిగ్గా చేయలేకపోతున్నారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో అందరికీ ఒకేలా ఉండదు. చాలీచాలని స్థలాల్లో, ఇంట్లో పిల్లల సందడి మధ్య పనిచేయడం ఒక సవాలుగా మారింది. అదీగాక ఇల్లు అనగానే డ్రెస్సింగ్ కూడా మారిపోతుంటుంది. వర్క్ చేసేటపుడు అది కూడా ప్రభావం చూపుతుందని తాజా సర్వే వెల్లడైంది. ఇంట్లో ఏదో ఒక సాధారణ డ్రెస్ లో ఉంటూ పనిచేయడం వల్ల ప్రోడక్టివిటీ తగ్గిపోతుందని సమాచారం. అలా కాకుండా ఆఫీసుకి ఎలా అయితే వెళ్ళేవారో అలాగే రెడీ అయ్యి కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయడం మంచిదని, దానివల్ల ప్రోడక్టివిటీ పెరుగుతుందని చెబుతున్నారు.

తాజాగా చేసిన ఒకానొక సర్వేలో 100మంది మహిళల్లో 80మంది మహిళలు ఇంటి నుండి పని కారణంగా సంతృప్తిగా లేమని, అలాగే మరో 20శాతం మంది మహిళలు, వర్క్ ఫ్రమ్ హోమ్ లో డ్రెస్సింగ్ కూడా ప్రభావం చూపుతుందని, ఫార్మల్ గా రెడీ అయ్యి పని మీద కూర్చుంటే ప్రోడక్టివిటీ, ఉత్సాహం పెరిగాయని చెప్పారు. అంటే, ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆఫీసులో ఉన్నామన్న వాతావరణం కావాలన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు కాబట్టి ఇలాంటి చిట్కాలు పాటించి వర్క్ ఫ్రమ్ యాంగ్జాయిటీని దూరం చేసుకోవడం ఉత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news