మనుషులకు వివిధ రకాలు భయాలు ఉంటాయి. చిన్నప్పుడు స్కూల్లో టీచర్ అంటే భయం. ముఖ్యంగా ఆ మ్యాక్స్ టీచర్ అంటే కొంతమందికి వెన్నులో వణుకే. మనకా లెక్కలు రావు, ఆ టీచర్ హోంవర్క్ చేయకపోతే బాదుడే బాదుడు. ఇలా ఆ భయం ఉంటుంది. కొంతమంది హైట్ అంటే భయం, కొంతమంది వాటర్, నిప్పు అంటే భయం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన భయాలు ఉంటాయి. అయితే వీటికి పేర్లు ఉంటాయి. తెలుసా..? ఆడవాళ్లంటే భయపడేవారి మనం భర్తలు అంటాం ఫన్నీగా అయితే లేడీస్ అన్నా వాళ్లతో మాట్లాడటం అన్నా ఉండే భయాన్ని గైనోఫోబియా అంటారు. ఇలా వివిధ రకలా భయాలు, వాటిపేర్లు చూద్దామా..! ఫన్నీగా..!
కొంతమందికి పెళ్లి చేసుకోవాలంటే భయం. పెళ్లి మాట ఎత్తగానే ఆందోళన చెందుతారు. పెళ్లి చేసుకోవడం ఇష్టమే ఉంటుంది. కానీ పెళ్లంటే భయం ఉంటుంది. ఈ భయాన్ని గామోఫోబియా అంటారు.
కొంతమంది డబ్బు ఖర్చు చేయడానికి భయపడతారు. వాళ్ల దగ్గర ఉన్నా సరే ఖర్చుపెట్టరు. సేవింగ్స్ చేయడం వేరు, పిసినారిగా ఉండటం వేరు. వీళ్లు ఇంకో రకం. అసలు ఖర్చు అంటే భయపడతారు. ఈ భయాన్ని క్రోమ్టోఫోబియా అంటారు.
మహిళలంటే పురుషులకు ఎలా అయితే భయం ఉంటుందో అలానే పురుషులంటే కొంతమంది మహిళలకు కూడా భయం ఉంటుంది. ఆ భయాన్ని ఆండ్రోఫోబియా అంటారు.
ఎవరైనా అందమైన అమ్మాయిలంటే ఆత్రంగా చూస్తారు. అలాంటి వాళ్లే భార్యగా రావాలని కోరుకుంటారు. కానీ కొంతమందికి అందమైన అమ్మాయిలంటేనే భయం. ఈ భయాన్ని వీనుస్ట్రాఫోబియా అంటారట.
కొంతమందికి ప్రేమించాలంటేనే భయం. ఆ భయం గతం తాలుకూ చేదూ జ్ఞాపకాల వల్ల అవ్వొచ్చు, మరే కారణం వల్లనే అవ్వొచ్చు కానీ.. మొత్తానకి వారికి ప్రేమించాలంటనే భయం. ఈ భయాన్ని ఫిలోఫోబియా అంటారు.
ఇదీ మరీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ముద్దుపెట్టాలన్నా, ఒకరితో పెట్టించుకోవాలన్నా కూడా భయమే ఉంటుందట. ఆ భయాన్ని ఫిలేమటోఫోబియా అంటారట.
ఇక ఇది అయితే అందరికీ ఉంటుందేమో.. మోబైల్ ఫోన్ లేకుండా ఉండాల్సి వస్తుందేమో అన్న భయం.. దీన్ని నోమోఫోబియా అంటారు. వీళ్లు అస్సలు మోబైల్ ఫోన్‌ను విడిచి ఉండలేరు.
ఇంతకీ మీకు ఇందులో ఏదైనా భయం ఉందా..!