వామ్మో..వీళ్ళను కూడా వదలరా..దండం రా బాబు..

-

మన దేశంలో చాలా మంది టాలెంట్ ఉన్నవాల్లు ఉన్నారు.. సినిమాల్లో గ్రాఫిక్స్ పెడితే..వీళ్ళు మాత్రం నిజంగానే ఉందా అన్న విధంగా వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ఈ మధ్య సినిమా పాటలను వారికి నచ్చిన విధంగా పాటలను క్రియేట్ చేస్తూ అదరహో అనిపిస్తున్నారు.తాజాగా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఖతార్‌లో జరుగుతోన్న ఫిఫా ప్రపంచ కప్‌లో పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులంతా ఈ పోటీల కోసం ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఏ దేశం విన్నర్ గా నిలుస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..అయితే, మరోవైపు ఫుట్‌బాల్ మేనియాలో ప్రపంచం అంతా ఊగిపోతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫుట్ బాల్ గురించి వీడియోల జాతర కనిపిస్తోంది. ఈ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ కూడా చేరింది.

బాక్సాఫీస్‌ వద్ద అద్భుత విజయాన్ని సాధించిన రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకు, ఫిఫా ప్రపంచ కప్‌నకు ఏంటి లింక్ అనుకుంటున్నారా.. విషయం అంతా ఓ పాటలో ఉంది. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాట ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే, కొంతమంది ‘నాటు’ సాంగ్‌లోని అద్భుత స్టెప్‌లో రామ్ చరణ్, ఎన్‌టీర్ ఫుట్‌బాల్‌ ఆడుతున్నట్లు క్రియోట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..

ఈ వీడియోలో భీమ్, రామ్‌లు డ్యాన్స్ చేస్తూ అద్భుతంగా గోల్ చేసినట్లు చూపించారు. ఇక అభిమానులు మాత్రం ఫిఫాకు మన స్టార్స్‌ను కూడా పంపిస్తే బాగుండేది. ఇలా ఆడితే ఈజీగా గోల్ కొట్టేస్తారంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫిఫా ట్రెండ్‌తో ఈ వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతుంది..ఇదే కాదు అల్లు అర్జున్ పాట కూడా ట్రెండ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news