‘రైస్‌ టీ’ తో ఎన్ని లాభాలో.. చరిత్ర చెప్తున్న సత్యం..!!

-

మార్కెట్లో చాలా రకరకాల టీలు ఉన్నాయి.. బరువు తగ్గడానికి, అందానికి ఏవేవో టీలు తాగుతున్నారు.. గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, మసాల టీ, హ్యాపీటీ, హెర్బల్‌ టీ ఇలా చాలా ఉన్నాయి.. కానీ మీరు రైస్‌ టీ గురించి విన్నారా..? బియ్యంతో టీ ఏంట్రా అనుకుంటున్నారా..? దీన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పండే బ్లాక్ రైస్, రెడ్ రైస్‌తో తయారు చేస్తారు. మేఘాలయలో షా-కూ అని చెప్పుకునే ఈ ద్రవాహారం చాలా మంచిదట. షా అంటే చాయ్ అని కూ అంటే బియ్యం అని అర్థం. జపనీయులు కూడా మరోరకంగా దీన్ని తాగుతారు. వాళ్లు దీని తయారీకి బ్రౌన్ రైస్ వాడతారు. అక్కడ దీన్ని జెన్మాయిషా అని అంటారట. వేయించిన బ్రౌన్ రైస్ తోపాటు దీని తయారీలో గ్రీన్ టీని కూడా ఉపయోగించి జన్మాయిషా తయారు చేస్తారు.

రైస్ టీ చరిత్ర ఇప్పటిది కాదు..

బ్రిటీష్ వారు మామూలు తేయాకును ఇక్కడ పరిచయం చేసే వరకు కూడా షిల్లాంగ్‌కు దక్షిణం వైపు 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాస్కిన్ బ్లాక్ లోని గ్రామాలలో షా-కూ చాలా ప్రాచూర్యంలో ఉండేది.. నెమ్మదిగా అక్కడి నుంచి వలసలు పెరిగిపోయిన తర్వాత ఈ రైస్ టీ పట్టణాలకు కూడా పాకింది. అస్సాంలో ఎక్కువ మంది విందు భోజనం తర్వాత ’షా’ అనే ఈ రైస్ టీని అతిథులకు ఇస్తారట. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది..

 రైస్‌ టీ ఎలా చేస్తారు..?

నాలుగు కప్పుల రైస్ టీ కోసం 1 టేబుల్ స్పూన్ స్టిక్కీ గా ఉండే బ్లాక్ రైస్ లేదా రెడ్ రైస్‌ను 2-3 నుంచి మూడు నిమిషాల పాటు వేయించాలి.
తర్వాత ఇందులో 3-4 కప్పుల నీటిని పోసి 3-5 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి.
తర్వాత వడ కట్టి వేడిగా వడ్డించడమే.
జపాన్, కొరియా వారు దీనికి కొద్దిగా ఆర్గానిక్ గ్రీన్ టీని కలుపుతారు.
విందు భోజనం తర్వాత జీర్ణక్రియకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ టీ ఉపయోగపడుతుందట.
ఈ టీ లో ఫ్లెవనాయిడ్స్, ఆంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి… దీనికి హ్యాండ్ రోల్డ్ గ్రీన్ టీ కూడా కలిపి ఇవ్వడం వల్ల మరింత పోషక భరితం చెయ్యవచ్చని న్యూట్రీషన్ నిపుణులు అంటున్నారు. ఈ టీలోని సెలీనియం థైరాయిడ్ పనితీరును సమతులంగా ఉంచుతుంది. జీవక్రియలు కూడా నియంత్రణలో ఉంటాయట… బియ్యం చర్మానికి మేలు చేస్తుంది.. చర్మం మృదువుగా ఉండేందుకు , ముడతలు రాకుండా నివారించేందుకు దోహదం చేస్తుంది.. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓసారి ట్రే చేయండి..! అటు ఆరోగ్యానికి, ఇటు అందానికి ఈ టీ బాగా ఉపయోగపడుతుంది..!

Read more RELATED
Recommended to you

Latest news