రైలులో వెళ్లేటప్పుడు కొన్ని రూల్స్ ని పాటించాలి. లేదంటే ఫైన్ విధిస్తారు. లేదంటే జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో చాలామంది ఆల్కహాల్ కి అలవాటు పడిపోయారు. యావరేజ్ గా చూసుకున్నట్లయితే ఇండియాలో ఒక వ్యక్తి 4.9 లీటర్ల మద్యాన్ని సంవత్సరానికి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆల్కహాల్ ని తీసుకోవడం మంచిది కాదు. అలాగే ఆఫీసుల్లో కూడా తీసుకోకూడదు. రైలులో ఆల్కహాల్ ని తీసుకు వెళ్ళడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇండియాలో ఎప్పుడైనా ట్రైన్ లో వెళ్లేటప్పుడు ఆల్కహాల్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
రైలులో వెళ్లేటప్పుడు మద్యం తీసుకు వెళ్ళొచ్చా?
మన భారతదేశంలో రైలులో కంఫర్ట్ గా ట్రావెల్ చేయొచ్చు. ఇండియన్ రైల్వేస్ మద్యానికి సంబంధించి కొన్ని రూల్స్ ని తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే యాక్ట్ ఆఫ్ 1989 ప్రకారం రైలులో మద్యాన్ని తీసుకెళ్లొచ్చు. కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి. మధ్యాహ్నం సేవించడం, మద్యం తీసుకువెళ్లడం కొన్ని రాష్ట్రాలలో బంద్ చేశారు. గుజరాత్, నాగాలాండ్, బీహార్, లక్షద్వీప్ లో మద్యం తీసుకెళ్లడం నిషేధం. ఒకవేళ తీసుకువెళ్లినట్లయితే ఫైన్ వేయడం లేదంటే జైలు శిక్ష వేయడం జరుగుతుంది.
ఎంత మద్యం తీసుకువెళ్లొచ్చు..?
మాక్సిమం రెండు లీటర్ల వరకు ఒక వ్యక్తి తీసుకు వెళ్లొచ్చు. ఈ బాటిల్స్ సీల్ చేసి ఉండాలి. తెరిచినా లేదంటే సగం తెరిచినా అనుమతించరు. లిమిట్ దాటి మద్యం తీసుకువెళ్తే కచ్చితంగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే ప్లాట్ ఫామ్స్ మీద మద్యం సేవించడం కూడా నిషేధం. ఒకవేళ అలా పట్టుకున్నట్లయితే ఆరు నెలలు జైలు శిక్ష లేదంటే 500 రూపాయలు విధిస్తారు.