వీటిని పాటిస్తే భార్యాభర్తల మధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది..!

-

పెళ్లి అనేది జీవితంలో చాలా మధురమైనది. అయితే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ఒకరికొకరు గౌరవించడం ఇలాంటివి చాలా ముఖ్యం. అలాగే భార్య భర్తలు ప్రేమగా ఉండాలంటే ఇవి తప్పక అనుసరించాలని చాణక్యనీతి చెబుతోంది.

అయితే మరి ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి లో చెప్పిన ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇలా కనుక భార్య భర్తలు అనుసరిస్తే తప్పకుండా వాళ్ళ ప్రేమ రెట్టింపు అవుతుంది. అలానే ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది. అయితే మరి చాణక్యనీతి ఏం చెబుతోంది..?, చాణక్యుడు చెప్పిన విషయాలు ఏమిటి అనేది చూద్దాం.

భార్య భర్తల మధ్య ప్రేమతో పాటు గౌరవం ఉండాలి:

భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవడం ముఖ్యం. గౌరవిస్తే బంధం బాగుంటుందని ఆచార్య చాణక్య చెప్పారు. ఒకరి గౌరవాన్ని మరొకరు దెబ్బతీస్తే వాళ్ళ మధ్య దూరం పెరిగిపోతుంది అని చెబుతోంది.

కష్టాల్లో కూడా తోడుగా ఉండాలి:

ఎప్పుడూ ఆనందాన్నే పంచుకుంటాను కష్టాలు నావి కావు అని సైడ్ అయి పోవడం మంచిది కాదు. భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరి కష్టసుఖాలని పంచుకోవాలి. ఎప్పుడైతే ఒకరి కష్టసుఖాలని పంచుకుంటారు అప్పుడే ప్రేమ ఉంటుంది.

ఇతరుల ముందు కొట్టుకోకండి:

భార్యాభర్తలు ఎదుటి వాళ్ళ ముందు దూషించుకోవడం, కొట్టుకోవడం లాంటివి చేయకూడదు. ఏదైనా సమస్య ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకోవాలి. అంతేకానీ నలుగురి ముందు వాటిని చెప్పుకుని చులకన చేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల బయట గౌరవం కోల్పోతారు దీని కారణంగా కూడా భార్యాభర్తల అనుబంధం తగ్గుతుంది. కాబట్టి ఈ మూడు విషయాలను గుర్తు పెట్టుకుంటే తప్పక భార్యాభర్తల మధ్య బంధం బాగుంటుంది అలాగే ప్రేమ కూడా రెట్టింపు అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news