ఇది బ్యాగ్ మాత్రమే కాదు..అమ్మాయిల ఆత్మరక్షణ కూడా..

-

మహిళల రక్షణ కోసం ఎన్నో కొత్త చట్టాలను ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వస్తున్నారు.అయినా కూడా దేశం నలుమూలల నుంచి ఎక్కడో చోట ఏదొక విధంగా అమ్మాయిలు హింసలకు గురవుతున్నారు.ప్రేమ అనే ముసుగులో ఎక్కువ మంది ఇబ్బందులకు గురవుతున్న సంగతి తెలిసిందే..ఆధునిక అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో. వారు ధైర్యంగా ఉండడంతో పాటూ, తమను తాము కాపాడుకునే శక్తిని కలిగి ఉండాలి..

ఓ వ్యక్తి మహిళ రక్షణ కోసం ఒక కిట్‌ను రూపొందించాడు. అందులో ఒక హ్యాండ్ బ్యాగ్, చెవి రింగులు, చెప్పులు వస్తాయి. ఈ మూడింటికీ టెక్నాలజీ సాయంతో ప్రత్యేకమైన శక్తిని అందించాడు. ఇవి దగ్గర ఉంటే ఆ స్త్రీ ఎక్కడ ఉన్న వెంటనే సహాయం అందేలా చేస్తాయి. వీటిని ఉత్తరప్రదేశ్ కు చెందిన శ్యామ్ చౌరాసియా రూపొందించాడు.తమని తాము రక్షించుకునేందుకు ఈ కిట్ ఉపయోగ పడుతుందని భావించాడు..

ఈ కిట్ లోని హ్యాండ్ బ్యాగ్ చాలా అందంగా ఉంటుంది.కానీ లోపల ఇన్‌బిల్ట్ గన్ ఉంటుంది. పర్సుపై ఉన్న చిన్న రెడ్ బటన్ నొక్కడం వల్ల గన్ పేలుతుంది. మహిళలకు మరీ ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడినప్పుడు దీన్ని వాడుకోవచ్చు. ఇది ప్రాణాలు తీసేంత శక్తివంతమైనది కాకపోయినా, గాయపరుస్తుంది. కాబట్టి కచ్చితంగా ఆ పరిస్థితుల నుంచి లేదా దుండగుడి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఈ కిట్ చెప్పులు, చెవిపోగులు కూడా సాయం చేసేందుకే ఉన్నాయి. చెవిపోగుల్లో జీపీఎస్ ఉంటుంది. అది మీ లొకేషన్ జీపీఎస్ ట్రాకింగ్ మెకానిజం ద్వారా ఇతరులకు తెలిసేలా చేస్తుంది. అంతేకాదు అత్యవసర సమయంలో కాల్ ఆప్షన్‌ను కూడా కలిగి ఉంటుంది.

చెప్పులు కూడా విద్యుత్ తరంగాలను కలిగి ఉంటాయి, ఎదుటివ్యక్తిని తన్నడం వల్ల వారికి కరెంట్ షాక్ తగులుతుంది.అయితే వీటిని ప్రతి రెండు వారాలకు ఒకసారి ఛార్జింగ్ పెట్టుకోవాలి..ఇక దీని ధర రూ.2497 త్వరలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారు. ప్రతి అమ్మాయి దగ్గర కచ్చితంగా ఉండాల్సిన ఆత్మరక్షణ కిట్ ఇది..మరి ఇది అమ్మాయిలకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version