శృంగారం: ఆడవాళ్ళు తెలుసుకోవాలని మగాళ్ళు కోరుకునే కొన్ని విషయాలు.

రతి క్రీడలో భాగస్వాములిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా ఉత్తమం. శృంగార విషయంలో ఎవరి అభిరుచులు, అభిప్రాయాలు, ఇష్టాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాకపోతే అవతలి వారు ఏమనుకుంటారో అన్న కారణంగా వాటిని బయటపెట్టరు. దానివల్ల శృంగారంలో అసంతృప్తి చెందుతుంటారు. తమ పట్ల నమ్మకాన్ని కోల్పోయినట్లుగా ఫీలవుతారు. అందువల్ల శృంగారంలో అవతలి వారికి తమ విషయాలను చెప్పాలి. ఈ విషయంలో ఆడవాళ్ళు తెలుసుకోవాలని మగాళ్ళు భావించే కొన్ని విషయాలను చర్చిద్దాం.

టీజింగ్

రతిక్రీడకి ముందు టీజింగ్ చేయాలని మగవాళ్ళు భావిస్తారు. దానివల్ల తమలోని కోరికలు శిఖరాగ్ర స్థాయికి వెళతాయని వారి భావన. ఈ విషయాన్ని ఆడవాళ్ళు తెలుసుకోవాలని మగవాళ్ళు కోరుకుంటారు.

ఫాంటసీ చెప్పడం

సెక్స్ విషయంలో ఫాంటసీలు అందరికీ ఉంటాయి. ఆ విషయాల్ని భాగస్వామితో పంచుకోవాలి. ఈ విషయం చెప్పాలని మగవాళ్ళు చాలా ప్రయత్నిస్తారు. కొంతమంది చెప్పడానికి సంశయించి సంతృప్తి చెందకుండా ఉండిపోతారు.

ఫాంటసీ అడగడం

అవతలి వారి ఫాంటసీలని అడగాలని, దానివల్ల వారి కోరికలను తెలుసుకుని అందుకు తగినట్లుగా నడుచుకుందామని మగవాళ్ళు భావిస్తారు. అందుకే ఫాంటసీల గురించి అడగాలని అనుకుంటారు. అడుగుతారు.

ఆకర్షణ తెలియజేయడం

అవతలి వారిలో ఏ విషయం తమకు బాగా నచ్చుతుందో దాన్ని తెలియజేయాలని కుతూహల పడుతుంటారు. పర్సనాలిటీలో ఏ అంశం తమకు బాగా ప్రేరేపిస్తుందో చెప్పాలని మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.

అంతిమంగా అద్భుతం అన్న ఆకాంక్ష

మగవాళ్ళు పొగడ్తలని కోరుకుంటారు. ముఖ్యంగా శృంగారం విషయంలో ఈ కోరిక కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ నుండి ప్రశంసలను వెదజల్లండి. అందులో మునిగి తేలడానికి వారు సిద్ధంగా ఉంటారు.