ఆ కారణాల వల్లే భార్యాభర్తలు ఎక్కువగా విడిపోతారట..!

-

చాలామంది భార్యాభర్తలు పలు కారణాలు వలన ఈ రోజుల్లో విడాకులు తీసుకుంటున్నారు. అసలు భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు..? దాని వెనుక కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఎక్కువమంది ఈ కారణాల వల్లే విడిపోతున్నారట.

ఎమోషనల్ గా దూరంగా ఉండడం

భార్యాభర్తలు ఎమోషనల్ గా దూరం గా ఉండడం వలన వారి మధ్య స్పేస్ ని క్రియేట్ చేస్తుంది. సరైన కమ్యూనికేషన్ కూడా వాళ్ళ మధ్య ఉండదు. ఈ కారణంగా వారి మధ్య ఇబ్బందులు వచ్చి విడిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలాగే చాలా మంది విడిపోతున్నారు కూడా.

బోర్ కొట్టడం

భార్యాభర్తలు కొన్ని కొన్ని సార్లు పక్కపక్కనే కూర్చుంటారు చూడడానికి కలిసి ఉన్నారు కదా అని అనుకుంటారు. నిజానికి లాప్టాప్ ఫోన్ తో బిజీగా కూర్చుని ఉంటున్నారు. ఈ కారణంగా వారి మధ్య మాటలు ఉండవు దీనివలన బంధం కూడా దూరం అయిపోతుంది.

బాధ్యత లేకపోవడం

భార్య లేదా భర్త బాధ్యతగా లేకపోతే కూడా మరొకరికి ఇబ్బంది వస్తుంది. వాళ్లని అసలు పట్టించుకోవడం కూడా మానేస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వారి ఆరోగ్యం ఎలా ఉంది, ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు ఇవేమీ కూడా పట్టించుకోరు. ఇలా బాధ్యతగా లేకపోవడం వలన చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.

దురలవాట్లు

ఆల్కహాల్ వంటి వాటికి బానిసలై పోతున్నారు. దీన్ని కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. బాధ్యతగా ఉండరు. ఇబ్బందులు కలుగుతాయి. ఫైనల్ గా విడిపోతారు.

సెక్స్ సమస్యలు

సెక్స్ పై మొదట్లో ఆసక్తి ఉన్నా కొన్ని రోజుల తర్వాత దీనిపై ఆసక్తి ఉండదు లేకపోతే కొంతమందికి సమయం ఉండదు. చాలా మంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు దీంతో అందమైన జీవితం మాయమైపోతుంది. ఒకరికి ఇంట్రెస్ట్ ఉండి మరొకరికి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version