ఈరోజు హైదరాబాద్‌లో నో షాడో.. మీ నీడను మీరు కోల్పోతున్నారు.. బీ రెడీ..!

-

నో షాడో: ఈ ప్రపంచంలో ఏది మనతో శాశ్వతంగా ఉండదు.. ఏదో ఒక రోజు అన్నీ దూరమవుతాయి.. నీతో కడవరకూ ఉండేది ఒక్క నీ నీడ మాత్రమే.. ఇలాంటి డైలాగ్స్‌ మీరు వినే ఉంటారుగా.. కానీ ఈరోజు ఆ నీడ కూడా మీతో ఉండటం లేదు.. ఏంటి నమ్మడం లేదా..? ఈరోజు హైదరాబాద్లో నో షాడో డే.. మీ నీడ మీకు కనిపించదు. ఎప్పుడంటే..

హైదరాబాద్‌ ప్రజలు.. ఇవాళ మధ్యాహ్నం వారు నీడ లేని పరిస్థితిని కళ్లారా చూస్తారు. దీన్నే జీరో షాడో డే (Zero Shadow Day (ZSD)) అని పిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ డే… వేర్వేరు ప్రాంతాల్లో సంవత్సరానికి రెండుసార్లు జరుగుతూ ఉంటుంది. ఈ జీరో షాడో డే నాడు.. సూర్యుడు నడినెత్తిపైకి వస్తాడు. అందువల్ల నీడ ఎటూ పడకుండా… నిలువుగా మాత్రమే పడుతుంది. ఫలితంగా వస్తువు లేదా ప్రాణులు లేదా మనుషుల పక్కన నీడ కనిపించదు.

 

ఇలా ఎందుకు జరుగుతంది..

ఇలా జరగడానికి కారణం.. భూమి కాస్త పక్కకు వంగి.. (23.45 డిగ్రీల వంపు) సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండటమే. ఈ వంపు వల్ల… సూర్య కిరణాలు.. ఏడాది మొత్తం ఒకే రకంగా పడవు. అందువల్ల ఒక్కో చోట.. ఒక్కో సమయంలో నో షాడో డే వస్తుంది. అలాగే.. నీడల పరిమాణంలో కూడా పెరుగుదల, తగ్గుదల కనిపిస్తాయి.

ఇంతకీ ఎప్పుడంటే..

ఈరోజు హైదరాబాద్‌ ప్రజలు జీరో షాడోను చూస్తారు. 17.3850° N దగ్గర… పర్ఫెక్ట్ జీరో షాడో ఉంటుంది. మధ్యాహ్నం 12.12కి ఇది కనిపిస్తుంది. ఈ సమయంలో ఎండలో నిల్చున్న హైదరాబాదీలకు నీడ కనిపించదు. ఎండలో ఏదైనా వస్తువును ఉంచినా… దానికి పక్కన నీడ పడదు. ఇది 2 నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ నీడ కనిపిస్తుంది

ఆగస్ట్ 3న కూడా ఇలాంటిది జరిగింది. అప్పుడు బెంగళూరులో చాలా మంది నో షాడోను కళ్లారా చూశారు. అరుదైన అనుభవం పొందారు. ఇవాళ ఈ దృశ్యాన్ని చూసేందుకు విద్యార్థులు ప్రయోగాలు చెయ్యవచ్చు. ఏదైనా ప్లాస్టిక్ గొట్టాన్ని మధ్యాహ్నం 12 గంటలకు ఎండలో నిలబెట్టాలి. అప్పుడు దానికి నీడ ఉంటుంది. సరిగ్గా 12.12 అయ్యేసరికి నీడ కనిపించదు. మళ్లీ 12.14 నుంచి నీడను చూస్తారు.. సో.. బీ రెడీ మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version