రాఖీ స్పెషల్ స్వీట్.. రేటు వింటే కళ్ళు బైర్లు కమ్ముతాయి..

-

స్వీట్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది.. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తింటారు. స్వీట్ ధర కిలో 500 లేదా 2000 వరకూ ఉంటుంది.. ఇప్పుడు చెప్పుకొనే స్వీట్ మాత్రం ఏకంగా పాతికవేలు ఉంటుంది..ఆ స్వీట్ రేటుతో పాటు తయారి విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.. అంత రేటు ఉన్నా చాలా మంది కొనడానికి ముందుకు వస్తున్నారు.. ఆ స్వీట్ ప్రత్యేకత ఏంటో వివరంగా తెలుసుకుందాం….

రాఖీ పౌర్ణమి అనే జరుపుకునే పండుగను.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు రక్షాబంధన్ పేరుతో వేడుకలు చేసుకుంటారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు, బంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ సందర్భంగా.. వ్యాపారులు వినూత్నంగా ఆలోచిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించి లాభాలు పొందుతారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాఖీ పౌర్ణమి పండుగ నేపథ్యంలో ఆగ్రాకు సంబంధించిన ఓ మిఠాయి దుకాణం యజమాని.. రాజస్థాన్ సంప్రదాయ మిఠాయిని స్పెషల్‌గా తయారు చేసి చూపరులను ఆకట్టుకుంటున్నాడు.

బ్రజ్ రసయన్ మిఠాయి భండార్ యజమాని.. పాలు, నేయ్యి, పండి, చెక్కెర, డ్రై ఫ్రూట్స్‌తో ఘేవార్ను తయారు చేసి.. దానిపై 24 క్యారెట్ల బంగారు పూత వేస్తున్నారు. ఇలా తయారు చేసిన దాని ధర కేజీ రూ.25వేలుగా ఫిక్స్ చేశాడు. కాగా.. స్వీట్ షాప్‌కు వచ్చిన కస్టమర్లు.. బంగారు పూతతో మెరిసిపోతున్న ఆ స్వీట్ ను చూసి ముచ్చటపడుతున్నారు. ఈ క్రమంలోనే డబ్బులను ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ స్వీట్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 12 కేజీల స్వీటును అమ్మినట్టు సదరు యజమాని పేర్కొన్నాడు..అలా ఆ స్వీట్ ప్రత్యేకత వార్తల్లో నిలిచింది..డబ్బులున్న వారికి ఎంతైనా తక్కువే..సామాన్యులకు మాత్రం అది ఖరీదైన స్వీటే..

Read more RELATED
Recommended to you

Latest news