ప్లాస్టిక్‌తో రోడ్లు.. పర్యావరణానికి మేలు.. చూసేందుకు ఎగడబడుతున్న జనాలు..!

-

ప్లాస్టిక్‌తో రోడ్లు: పర్యావరణానికి హాని కలిగించే.. ప్లాస్టిక్‌ను నిషేధించడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. చాలామంది..దీన్ని నిషేధించే విషయం పక్కన పెట్టి.. రియూస్‌ చేసే అంశంపై దృష్టిపెడుతున్నారు. ప్రకృతికి హాని కలగకుండా దీన్ని మళ్లీ ఎలా వాడొచ్చు అని పర్యావరణ ప్రేమికులు ఆలోచిస్తున్నారు. ప్రతి సంవత్సరం 300 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాం. ఈ వ్యర్థాలలో కేవలం 9శాతం మాత్రమే రీసైకిల్ అవుతుంది. మిగిలినదంతా సహజ వాతావరణంలో డంప్ అవుతుంది. అంటే వ్యవసాయ భూములు, నదుల్లో. ప్లాస్టిక్ ని రియ్యూజ్ చేసేందుకు ప్లాస్టిక్ రోడ్ల కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది.. ఇప్పటికే ఏపీతో సహా చాలా చోట్ల ప్లాస్టిక్ రోడ్లు దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో పారేసిన ప్లాస్టిక్‌ని పిచ్‌తో కలిపి బ్లూ రోడ్‌ను తయారు చేసింది బెంగాల్ లోని ఓ ఊరు.

పశ్చిమబెంగాల్ లోని తూర్పు బర్ధమాన్‌లోని రైనాకు చెందిన ఉచలన్ గ్రామ పంచాయతీ ఈ రహదారిని నిర్మించింది. ఈ రహదారి మన్నికైనదిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నీలిరంగు రోడ్డు ఆ ప్రాంతానికి ఎంతో అందాన్ని తెచ్చింది. ఈ రహదారిని చూసేందుకు చాలా మంది జనం పోటెత్తుతున్నారు. పంచాయతీ ప్రోత్సాహంతో మరిన్ని చోట్ల ఈ తరహా రోడ్డు నిర్మాణం జరుగుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఎక్కువగా నీరు నిలిచినా.. భారీ వర్షం పడినా.. ఎండ పెరిగినా రోడ్డు పాడైపోతుంది. అరబ్ దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అక్కడ అందుకే రోడ్లపై ప్లాస్టిక్ నీలంతో పూత పూశారు. బర్ధమాన్‌లో కూడా అదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల సూర్యరశ్మి నేరుగా రోడ్డును కరిగిపోయేలా చేయదు. ఈ రోడ్డు వాటర్ ప్రూఫ్ తో పాటు హీట్ ప్రూఫ్ కూడా. తూర్పు బర్ధమాన్‌లోని రైనా 2 బ్లాక్‌లోని ఉచలన్ ప్రాంతంలోని ఏకలక్ష్మి ప్రాంతంలో ఈ నీలిరంగు రహదారిని నిర్మించారు. ఏకలక్ష్మి టోల్ ప్లాజా నుంచి రౌతరా వంతెన వరకు ప్లాస్టిక్‌ వెస్ట్‌తో కలిపిన 320 మీటర్ల నీలం రహదారి చూసేందుకు చాలా అందంగా ఉంది. దాదాపు 22 లక్షల 94 వేల రూపాయలతో ఈ రోడ్డును నిర్మించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఇందులో 15లక్షల రూపాయలుండగా.. పంచాయతీ సొంత నిధులు 8 లక్షల రూపాయలన్నట్లు పంచాయతీ అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version