శోభనం రోజు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చిన భార్య.. ఆ ఒక్క మాటతో…

-

పెళ్లి.. అసలు ఈ స్టేజ్‌ అంటే చాలామంది యువతకు భయంపట్టుకుంది. లవ్‌ మ్యారేజ్‌ అయితే అంత టెన్షన్‌ ఉండదు. కానీ అరేంజ్‌ మ్యారేజ్‌ అంటే..అన్ని అనుమానాలే.. అడిగితే ఒక భయం అడగకుంటే మరో భయం.. సరే..ఏదిఏమైనా పెళ్లి అయితే అవుతుంది. ఇక ఫస్ట్‌ నైట్‌ అంటే ఎవరికైనా కొంచెం టెన్షన్‌, కొంచెం యాన్‌గ్జైటీ , ఉత్సాహం అన్నీ ఉంటాయి.. ముఖ్యంగా అబ్బాయిలకు అయితే ఆ ఫీలే వేరు. పాపం ఇలానే పెళ్లి చేసుకోని ఫస్ట్‌నైట్‌ రోజు రూంలో కుర్చోని భార్యకోసం ఎదురుచూస్తున్నాడు.. పాల గ్లాసుతో వచ్చిన భార్య దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది..

- Advertisement -

ఈటాలోని జైతారా గ్రామానికి చెందిన ఓ యువకుడు.. ఇటీవల ఢిల్లీకి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఫస్ట్ నైట్ రోజు ఆమె శారీరక సంబంధానికి నిరాకరించడంతో.. బహుశా అలిసిపోయి ఉండొచ్చేమో అనుకున్నాడు. రెండో రోజు కూడా భార్య ప్రవర్తన అదే తీరులో ఉండటంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీశాడు. దీనితో ఆమె అసలు విషయం చెప్పింది.. ఏంటంటే.. తానొక ట్రాన్స్‌జెండర్ అని.. తన తల్లిదండ్రులు ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారని నిజాన్ని బట్టబయలు చేసింది. అంతే

మనోడి ఫీజులు ఎగిరిపోయాయ్‌..

వరుడు ఆమెను తిరిగి వాళ్ళింటికి పంపించేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు వధువు తరఫు బంధువులు వరుడి ఇంటికి వచ్చి కట్నం డబ్బు, నగలను తీసుకెళ్లారు. అయితే పెళ్లికి తాను పెట్టిన ఖర్చు ఇవ్వాలని వరుడు అడగటంతో వధువు కుటుంబీకులు అతడిపై దాడి చేశారు. దీంతో వరుడు, అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తప్పు చేసింది కాక..మళ్లీ దాడి చేయడం ఏంటో..? పెళ్లి ఆగిపోయినా, పెళ్లి జరిగిన వెంటనే ఇలాంటి ఊహించని ఘటనలు జరిగినా.. అబ్బాయి, అమ్మాయి ఎవరి జీవితంలో అయినా కష్టంగానే ఉంటుంది. అందుకే అరేంజెడ్‌ మ్యారెజ్‌ అని అన్నీ సంప్రదాయబద్ధంగా పోకుండా.. మన ఎక్వైరీ మనం చేసుకోవాలి. అబ్బాయి జాబ్, వ్యక్తిత్వం అన్నీ తెలుసుకోవాలి. అలాగే అమ్మాయి గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆత్రం ఆలోచనలు అస్సలు పనికిరావు.. ఇంకా ఆ పాత సామెతను పట్టించుకుంటే ఈరోజుల్లో బంధాలు నిలబడవు.. అవి ఒక్కప్పటి రోజులు..వంద అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు అని..ఇప్పుడు అలా చేస్తే.. రెండో రోజే కథ క్లైమాక్స్‌కు వచ్చేస్తుంది.!

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...