ఆ యువతి నెలకు మూడు సార్లే స్నానం చేస్తుందట..! ఎందుకంటే..

మన శరీరం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే.. అంత అందంగా ఉంటుంది. చెమటలు పట్టాక అలానే స్నానం చేయకుండా ఉంటే..కంపు కొడుతుంది. అసలు రోజులో కనీసం ఒక్కసారైన స్నానం చేయాలి. లేకుంటే అంతే సంగతులు.. అయితే చాలా మందికి స్నానం చేయడం అంటే.. ఎక్కడ లేని బద్ధకం వస్తుంది. అదేదో వందమంది పై ఉద్యమం చేయమన్నట్లు ఫీల్ అవుతారు. ఐదు నిమిషాల పనికి ఎందుకంత బద్ధకమో.. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ అలవాటు ఎక్కువుగా ఉంటుంది. మూడ్ ఉంటే.. గంటల తరబడి చేస్తారు.. లేదంటే అస్సలు స్నానం జోలికే పోరు.. ఎంత బద్దకం ఉన్నా ఒక రోజు కాకపోయినా మరుసటి రోజు కచ్చితంగా చేయాల్సిందే.. అయితే ఓ యువతి నెలకు మూడు సార్లు మాత్రమే స్నానం చేస్తుందట.. ఛీ అనుకుంటున్నారా.. విషయం తెలిసిన నెటిజన్లు కూడా అలానే అంటున్నారు.. ఇంతకీ ఆమె ఎవరంటే..!

శరీర శుభ్రతలో భాగంగా స్నానం రోజూ చేయడం అలవాటు.. స్నానం ఒక్క గంట లెట్ అయినా చిరాకుగా అనిపిస్తుంది. కొందరు రోజుకు రెండు సార్లు.. నిద్ర లేచిన వెంటనే ఒకసారి.. రాత్రి నిద్రపోయేముందు రెండోసారి స్నానం తప్పని సరిగా చేస్తారు. అయితే ఈ స్నానానికి కొందరు.. పాలు, తేనే, నూనె, రోజ్ వాటర్, గంధం వంటివాటిని ఉపయోగిస్తారు. విదేశాల్లో సూర్యకిరణాలు తాకే విధంగా ఆరుబయట పడుకుంటారు. దీనిని సన్ బాత్ అని కూడా అంటారు. ఏది ఏమైనా రోజూ స్నానం చేస్తారు. అయితే ఒక యువతకు తనకు స్నానం చేయడం చిరాకు.. అందుకనే నెలలో మూడు రోజులు మాత్రమే స్నానం చేస్తానని చెబుతోంది. అవును ఆ యువతి తాను ప‌దిరోజుల‌కొక‌సారి స్నానం చేశాన‌ని చెబుతోంది. ఓ మ‌హిళ అంటే నెల‌కు మూడుసార్లు మాత్ర‌మే స్నానం చేస్తుంది. తాను ప‌దిరోజుల‌కొక‌సారి మాత్ర‌మే స్నానం చేస్తాన‌ని, అయినా త‌న ఒంటినుంచి దుర్వాస‌న రావ‌డం లేద‌ని ఆ మహిళ చెబుతోంది.

టిక్‌టాక‌ర్‌ ఐడాన్ జేన్ . స్నానం చేయడానికి ఇష్టపడని అమ్మాయి. నెల‌కు మూడుసార్లు మాత్ర‌మే స్నానం చేస్తాన‌ని, పీరియడ్స్ వచ్చే రోజుల్లో కూడా ఈ రొటీన్ మారదని ఆమె తన. ఫాలోవర్స్‌కు చెప్పింది. ఏడు రోజులు స్నానం చేయకుండా కూడా తాను చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నానని ఆమె వీడియోలో చెప్పింది. ఎంతో విలువైన పర్యావరణాన్ని, నీటిని కాపాడడ‌మే ఈ నిర్ణయానికి కారణమని ఐడాన్ అంటుంది. క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌నివారికి చెమ‌ట‌లు ప‌ట్ట‌డం లేదా మురికి పేరుకోకుంటే రోజూ స్నానం చేయాల్సిన అవసర‌మే లేద‌ని చెబుతోంది ఐడాన్‌. తను చిన్న‌ప్ప‌టినుంచీ ప‌దిరోజుల‌కొక‌సారి మాత్ర‌మే స్నానం చేస్తుంద‌ట‌. కాన్సప్ట్‌ బాగుందని మీరు ట్రై చేస్తారా ఏంటి..!!