2024 పూర్తయ్యేలోగా తప్పకుండా చేయాల్సిన పనులు..

-

2024 సంవత్సరం గడిచిపోవడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. పాత క్యాలెండర్లు చెత్తబుట్టలోకి కొత్త క్యాలెండర్ లు గోడ మీదకు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో అసలు 2024 ని ఏ విధంగా ఎండ్ చేయాలనేది తెలియాలి. ఈ సంవత్సరం సరిగ్గా పూర్తయితే వచ్చే సంవత్సరం కరెక్ట్ గా స్టార్ట్ అవుతుంది. అందుకే 2024 సంవత్సరం పూర్తి అయ్యేలోపు కొన్ని పనులు చేయాలి.

సంవత్సరం మొత్తంలో సాధించిన పనుల లిస్టు:

ఒకరోజు మొత్తం కూర్చుని అసలు ఈ సంవత్సరంలో ఏం సాధించారో వాటన్నింటినీ లిస్టు రాసుకోండి. కచ్చితంగా ఏదో ఒక గొప్ప పని చేసి ఉంటారు. ఇలా రాయడం వల్ల.. నెక్స్ట్ సంవత్సరంలో ఏం చేయాలన్న ఆలోచన కలుగుతుంది.

మనసులో ఉన్న గందరగోళాన్ని పక్కన పెట్టండి:

ఎప్పుడైతే సాధించిన విజయాలు రాసుకుంటారో పొందిన అవమానాలు కూడా గుర్తొస్తాయి. బాధాకరం కలిగించే సంఘటనలు ఒకటో రెండో జరిగే ఉంటాయి. ఒక్కోసారి సంవత్సరం మొత్తం బాధ కలిగించే సంఘటనలే ఉండవచ్చు. అలాంటి వాటిని మనసులోంచి పూర్తిగా తీసివేయండి. కొత్త సంవత్సరానికి వెళ్తున్న సమయంలో వాటి గురించి ఆలోచించవద్దు.

స్నేహితులను కలవండి:

ఈ సంవత్సరంలో కలుద్దామని కలవలేకపోయిన స్నేహితులను ఒకసారి కలవండి. వాళ్లు చాలా దూరంలో ఉన్నట్లయితే కనీసం వీడియో కాల్ లో మాట్లాడండి. అది మీ మనసుకు మంచి తృప్తిని ఇస్తుంది.

కొత్తగా ఏదైనా ప్రయత్నించండి:

చాలాసార్లు ఏదేదో చేద్దామని వాటిని చేయలేక మర్చిపోతుంటాం. ఈ సంవత్సరం పూర్తయేలోపు మాత్రం అస్సలు మరవద్దు. వెరైటీగా ఒక రోజు మొత్తంలో ఫోన్ వాడకూడదని నిర్ణయం తీసుకొని కట్టుబడి ఉండండి. దీనివల్ల మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది.

వచ్చే సంవత్సరం ఏం చేయాలో డిసైడ్ చేసుకోండి:

కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు ఆ సంవత్సరంలో ఏం చేయాలనేది ప్రతి ఒక్కరూ డైరీలో రాసుకుంటారు. మీరు కూడా రాయండి. ఊరికే రాయకుండా వాటిని ఎలా సాధించాలో కూడా నోట్ బుక్ లో నోట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version