ఈ యువతి ఏడాదికి 8 నెలలు పనిచేస్తుంది.. అయినా రూ.84 లక్షల జీతం

-

కొంతమంది రాత్రి పగలు కష్టపడితే కానీ డబ్బులు రావు, మరికొందరికి. ఒక గంట చేస్తే చాలు కావాల్సినంత పైసలు వస్తాయి. 400 కోసం ఒక వ్యక్తి రోజంతా కూలి పని చేయాలి.. అదే నాలుగు వందలు ఇంకో వ్యక్తికి గంటలో రావొచ్చు.. ఇక్కడ డబ్బు విలువైనది, కష్టం విలువైనదా అంటే చెప్పలేం. చేసే పని ముఖ్యం. ఒక అమ్మాయి.. పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తూనే సంవత్సరానికి 84 లక్షలు సంపాదిస్తుందో.. ఇక్కడ ఫుల్‌ టైమ్ చేసినా ఏడాదికి రూ. 5లక్షలు రావడం లేదు కదా.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఆమె చేసే ఆ ఖరీదైన పని ఏంటి..?

ఆ అమ్మాయి పేరు తెలియా జెన్నీ . ఆమె వయస్సు 21 సంవత్సరాలు ఆస్ట్రేలియా నివాసి. సాధారణంగా ఈ వయసులో అందరూ చదువుకుంటారు. కానీ ఈ అమ్మాయి ఏటా దాదాపు 84 లక్షల రూపాయలు సంపాదిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇది ఆమె పర్మినెంట్ ఉద్యోగం కాదు, ట్రైనీగా నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తోంది .

ది సన్‌లో వచ్చిన కథనం ప్రకారం, యువతి మైనింగ్‌లో పనిచేస్తోంది. గని వద్దకు వెళ్లి మెషిన్ టైర్లను రిపేర్ చేయడం. అమర్చడం మాత్రమే ఆమె పని. అయితే ఈ పని అనుకున్నంత సులువు కాదు. ఎందుకంటే గనుల్లో గుహల వల్ల చాలాసార్లు మరణించే అవకాశం ఉంది. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా కొన్ని సమయాల్లో పని చేయడానికి రోజుకు 12 గంటల కంటే ఎక్కువ సమయం అవసరం.

నివేదికల ప్రకారం, FiFo (ఫ్లై ఇన్, ఫ్లై అవుట్) ఉద్యోగాలు అంటే కంపెనీలు తమ ఉద్యోగులను ఏదో ఒక ప్రదేశంలో పని చేయడానికి తీసుకువెళ్లడం మరియు పని పూర్తయిన తర్వాత వారిని తిరిగి తీసుకురావడం. 8 నెలల పాటు నిరంతరంగా పనిచేయాలి. కంపెనీ ఉద్యోగిని మరొక ప్రదేశానికి రవాణా చేసినప్పుడు, అక్కడ ఉద్యోగి యొక్క అన్ని ఖర్చులను కంపెనీ భరిస్తుంది. మిగతా నాలుగు నెలలు పని ఉండదు. రెస్ట్ తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version